Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP SSC 2024 Time Table: మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. టైం టేబుల్‌లో స్వల్ప మార్పు!

ఆంధ్రపదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్ధులందరూ ప్రిపరేషన్ లో బిజీ గా ఉన్నారు. మార్చి 17 నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో సబ్జెక్ట్ వైజ్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మరోమారు వెల్లడించింది. పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది..

AP SSC 2024 Time Table: మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. టైం టేబుల్‌లో స్వల్ప మార్పు!
AP SSC 2024 Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 24, 2025 | 6:20 AM

అమరావతి, జనవరి 24: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. మార్చి నెలలో పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్‌ పరీక్షల తేదీలను విద్యాశాఖ వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్‌ సైన్స్, బయలాజీకల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 17వ తేదీ నుండి ఏప్రియల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

టెన్త్ 2024 పబ్లిక పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • మార్చి 17, 2025 (సోమవారం) ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌, ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌ 1 పరీక్ష
  • మార్చి 19, 2025 (బుధవారం) సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ పరీక్ష
  • మార్చి 21, 2025 (సోమవారం) ఇంగ్లిష్‌ పరీక్ష
  • మార్చి 22, 2025 (శుక్రవారం) ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌ 2, OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 1
  • మార్చి 24, 2025 (సోమవారం) మ్యాథమెటిక్స్‌ పరీక్ష
  • మార్చి 26, 2025 (బుధవారం) ఫిజికల్‌ సైన్స్ పరీక్ష
  • మార్చి 28, 2025 (శుక్రవారం) బయోలాజికల్‌ సైన్స్‌ పరీక్ష
  • మార్చి 29, 2025 (శనివారం) OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 2, SSC ఒకేషన్‌ కోర్సు
  • మార్చి 31 లేదా ఏప్రిల్ 1, 2025 (సోమవారం లేదా మంగళవారం) సోషల్‌ స్టడీస్‌ పరీక్ష

నిజానికి మార్చి 31వ తేదీన రంజాన్‌ సెలవు దినంగా ప్రభుత్వ కేలండర్‌లో ఉంది. నెలవంక మార్చి 31వ తేదీన కనిపిస్తే అదే రోజు రంజాన్‌ ఉంటుంది. ఒకవేళ ఆ రోజున పండగ వస్తే ఏప్రిల్‌ 1న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.