AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP PGCET 2025 Rank Card: పీజీసెట్‌లో 93.55 శాతం ఉత్తీర్ణత.. ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల..

AP PGCET 2025 Rank Card: పీజీసెట్‌లో 93.55 శాతం ఉత్తీర్ణత.. ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
Andhra Pradesh PGCET
Srilakshmi C
|

Updated on: Jun 26, 2025 | 5:36 AM

Share

అమరావతి, జూన్‌ 26: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పీజీసెట్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌, హాల్‌టికెట్‌ నంబర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 93.55శాతం మంది విద్యార్ధులు అర్హత సాధించారు.

ఏపీ పీజీసెట్‌ 2025 ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా జూన్‌ 9 నుంచి 12 వరకు ఉదయం, సాయంత్రం రోజుకు మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25,688 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను తాజాగా విడుదల చేసిన ఉన్నత విద్యామండలి త్వరలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా ప్రారంభించనుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ లాసెట్‌ ర్యాంకు కార్డులు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తెలంగాణ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2025(టీజీ లాసెట్‌ 2025) ర్యాంకు కార్డులు కూడా తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఫలితాలను విడుదల చేసింది. టీజీ లాసెట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా జూన్‌ 6వ తేదీన టీజీ ఎల్‌సెట్‌, పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 57,715 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 45,609 మంది పరీక్ష రాశారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు 13,491 మంది పరీక్షలు రాశారు.

తెలంగాణ లాసెట్‌ ర్యాంకు కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..
ప్రపంచంలోనే మూడో స్థానానికి వెండి.. ఆపడం ఇక కష్టమే బాసూ
ప్రపంచంలోనే మూడో స్థానానికి వెండి.. ఆపడం ఇక కష్టమే బాసూ
2025లో ప్రపంచాన్ని వణికించిన ఆ 6 సంఘటనలు ఇవే..
2025లో ప్రపంచాన్ని వణికించిన ఆ 6 సంఘటనలు ఇవే..
ఆ రోజే క్రికెట్ వదిలేద్దామనుకున్నా.. కానీ.!
ఆ రోజే క్రికెట్ వదిలేద్దామనుకున్నా.. కానీ.!
బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్