AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AICTE scholarship: ఇంజినీరింగ్ చదివే విద్యార్థినులకు రూ. 50 వేల వరకు స్కాలర్ షిప్.. పూర్తి వివరాలివే..

బీటెక్‌ లాంటి ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించే ప్ర‌తిభావంతులైన విద్యార్థినుల  కోసం అఖిల భార‌త సాంకేతిక విద్యామండ‌లి (AICTE )  స్కాల‌ర్‌షిప్‌ల‌ను  అందజేస్తోంది. కాగా ఈ ఏడాది గడువు జనవరి 31తో

AICTE scholarship: ఇంజినీరింగ్ చదివే విద్యార్థినులకు రూ. 50 వేల వరకు స్కాలర్ షిప్.. పూర్తి వివరాలివే..
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 20, 2022 | 7:00 AM

Share

బీటెక్‌ లాంటి ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించే ప్ర‌తిభావంతులైన విద్యార్థినుల  కోసం అఖిల భార‌త సాంకేతిక విద్యామండ‌లి (AICTE )  స్కాల‌ర్‌షిప్‌ల‌ను  అందజేస్తోంది. కాగా ఈ ఏడాది గడువు జనవరి 31తో ముగియనుంది. ఈక్రమంలో అర్హులైన వారు ఏఐసీటీఈ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినులు  ఈ స్కాలర్‌షిప్కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . ఈ స్కాలర్‌షిప్‌కు  ఎంపికైన వారికి ఏడాది రూ. 50000  లభిస్తుది .  కాగా ఈ స్కీమ్ అర్హతలు, ఇతర వివరాలు ఏఐసీటీఈ అధికారిక వెబ్ సైట్ లో ఉన్నాయి.  అందులో జారీ చేసిన  మార్గదర్శకాలను పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం

*దరఖాస్తు చేయడానికి, ముందుగా ఏఐసీటీఈ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.

*హోమ్ పేజీలో SCHOLARSHIPSకి వెళ్లండి.

*దీని తర్వాత AICTE  స్కీమ్స్ పై క్లిక్ చేయాలి.

* దరఖాస్తు ఫారమ్  లింక్ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంది.

*దరఖాస్తు  చేసేటప్పుడు అభ్యర్థులు సరైన సమాచారం అందించాల్సి ఉంటుంది.

*తప్పుగా పూరించిన  లేదా అసంపూర్ణ సమాచారంతో కూడిన  దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి.

AICTE స్కాలర్‌షిప్ అంటే ఏమిటి?

విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా చూసేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ రకాల స్కాలర్‌షిప్ పథకాలను అమలు చేస్తున్నాయి. అందులో   AICTE స్కాలర్‌షిప్ ప్రత్యేకం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రగతి స్కాలర్‌షిప్ (బాలికలు), సక్షం స్కాలర్‌షిప్ పథకం (ప్రత్యేకంగా వికలాంగ విద్యార్థులు), స్వనాథ్ స్కాలర్‌షిప్ పీజీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ల సమర్పణకు చివరి తేదీని పొడిగించింది.  అర్హులైన  విద్యార్థులు  జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) 2021 సంవత్సరంలో ప్రారంభించింది. ఈ స్కాలర్‌షిప్ కోసం అర్హులైన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన బాలికలకు వారి చదువుకు సంబంధించి ప్రతి సంవత్సరం రూ.50,000 అందజేస్తారు.

Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ల్లో టాప్-10 బౌలర్లు వీరే..!

U19 World Cup 2022: భారత జట్టులో కరోనా కలకలం.. కెప్టెన్‌తో సహా ఆరుగురికి పాజిటివ్..!