AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing: సమయం లేదు మిత్రమా? ఉచితంగా ఐటీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం.. త్వరపడండి..

ఐటీఆర్ ఫైల్ చేసేందుకు తుది గడువు సమీపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తిస్తుంది. ఒకవేళ గడువులోపు చేయకపోతే జరిమానా పడే అవకాశం ఉంది. కాబట్టి గడువులోగా ఫైల్ చేయడం ఉత్తమం.

ITR Filing: సమయం లేదు మిత్రమా? ఉచితంగా ఐటీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం.. త్వరపడండి..
Tax
Madhu
|

Updated on: Jul 03, 2024 | 3:23 PM

Share

ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఏటా తమ ఆదాయపు వివరాలతో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉంటుంది. అది వ్యక్తులతో పాటు, సంస్థలకు కూడా కీలక ఆర్థిక బాధ్యత. ఇది ప్రభుత్వానికి తమ ఆదాయం సక్రమంగా ఉందని నివేదించడం. మీరు రుణాలు తీసుకునేటప్పుడు, క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ ఆదాయం ఎంత? మీ పన్ను ఎంత కడుతున్నారు? అనే వివరాలతో కూడిన అధికారిక రికార్డుగా ఈ ఐటీఆర్ పనిచేస్తుంది. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేందుకు తుది గడువు సమీపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తిస్తుంది. ఒకవేళ గడువులోపు చేయకపోతే జరిమానా పడే అవకాశం ఉంది. కాబట్టి గడువులోగా ఫైల్ చేయడం ఉత్తమం.

ఆన్‌లైన్‌లో ఉచితంగా ఐటీఆర్ ఫైలింగ్..

మీ ఐటీఆర్ ఫైలింగ్ ను ఉచితంగా ఆన్ లైన్ లోనే సులభంగా ఫైల్ చేసుకునే అవకాశం ఆదాయ పన్ను శాఖ అందిస్తోంది. అందుకోసం మీరు పాటించవలసిన దశలను మీకు అందిస్తున్నాం..

  • ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి.
  • మీ పాన్, పాస్‌వర్డ్ ఉపయోగించి మీ ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ చేయండి. మీకు ఖాతా లేకుంటే, మీరు “రిజిస్టర్” లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కొత్త ఖాతాను సృష్టించవచ్చు.
  • ఆ తర్వాత మీరు మీ రిటర్న్‌ను ఫైల్ చేయాలనుకుంటున్న అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి. మీరు పూరించాల్సిన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోండి. మీరు పూరించాల్సిన ఐటీఆర్ ఫారమ్ మీ ఆదాయం, ఆదాయ వనరులపై ఆధారపడి ఉంటుంది.
  • ఐటీఆర్ ఫారమ్‌లో వివరాలను పూరించండి. మీరు ఫారమ్‌ను మాన్యువల్‌గా పూరించవచ్చు లేదా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ముందుగా నింపిన డేటాను ఉపయోగించవచ్చు.
  • మీరు చెల్లించాల్సిన పన్నును లెక్కించండి. మీరు చెల్లించాల్సిన పన్నును లెక్కించడంలో వెబ్‌సైట్ మీకు సహాయం చేస్తుంది.
  • మీరు వివరాలను పూరించిన తర్వాత, మీరు రిటర్న్‌ను ధ్రువీకరించాలి.
  • మీరు మీ ఆధార్ నంబర్, ఇ-సైన్ ఉపయోగించి లేదా రిటర్న్ భౌతిక కాపీని సీపీసీకి పంపడం ద్వారా రిటర్న్‌ని ధ్రువీకరించవచ్చు.
  • మీరు రిటర్న్‌ని ధ్రువీకరించిన తర్వాత, మీరు దానిని సమర్పించవచ్చు.

రిజిస్ట్రేషన్ ఎలాగో తెలియకపోతే ఇలా చేయండి..

  • ఆదాయపు పన్ను పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారుగా ఇ-ఫైలింగ్ కోసం నమోదు చేసుకోవడానికి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చెల్లుబాటు అయ్యే పాన్, చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, చెల్లుబాటు అయ్యే ప్రస్తుత చిరునామా రుజువు, చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ వంటివి ఉండాలి.
  • ‘ఇ-ఫైలింగ్’ పోర్టల్‌ని సందర్శించండి.
  • హోమ్ పేజీకి కుడి వైపున ఉన్న ‘ రిజిస్టర్ యువర్ సెల్ఫ్’ బటన్‌ను క్లిక్ చేయండి.
  • వినియోగదారు రకాన్ని ‘ఇండివిడ్యువల్’ను ఎంచుకోండి.
  • కంటిన్యూపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత పాన్; ఇంటిపేరు, మొదటి పేరు, మధ్య పేరు; పుట్టిన తేదీ; నివాస స్థితిని ఎంటర్ చేయండి.
  • తర్వాత ‘కంటిన్యూ’ పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత పాస్ వర్డ్ రూపొందించుకోండి. అలాగే సంప్రదింపు వివరాలు, ప్రస్తుత చిరునామా ఎంటర్ చేసి ‘సబ్మిట్ పై’ క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ తర్వాత, నివాసుల కోసం, రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీలకు ఆరు అంకెల ఓటీపీ1, ఓటీపీ2 షేర్ అవుతాయి. వాటిని ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...