FD Interest Rates: మారిన ఎఫ్‌డీ రేట్లు.. ఆ బ్యాంకులో ఏకంగా 8.75శాతం.. మిగిలిన బ్యాంకుల్లో ఎలా ఉన్నాయంటే..

అన్ని బ్యాంకుల్లో రేట్లు ఒకలా ఉండవు. బ్యాంకులను బట్టి రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న టాప్‌ నాలుగు బ్యాంకుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్యాంకుల్లో రూ. 3కోట్ల కంటే తక్కువైన మొత్తాలకు జూలై ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. వాటిల్లో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, పంజాబ్‌ సింధ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటివి ఉన్నాయి.

FD Interest Rates: మారిన ఎఫ్‌డీ రేట్లు.. ఆ బ్యాంకులో ఏకంగా 8.75శాతం.. మిగిలిన బ్యాంకుల్లో ఎలా ఉన్నాయంటే..
Fixed Deposit
Follow us

|

Updated on: Jul 03, 2024 | 2:47 PM

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకం. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు బాగానే ఉంటుంది. అయితే జూలై ఒకటో తేదీ నుంచి కొన్ని బ్యాంకులు తమ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. అన్ని బ్యాంకుల్లో రేట్లు ఒకలా ఉండవు. బ్యాంకులను బట్టి రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న టాప్‌ నాలుగు బ్యాంకుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్యాంకుల్లో రూ. 3కోట్ల కంటే తక్కువైన మొత్తాలకు జూలై ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. వాటిల్లో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, పంజాబ్‌ సింధ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటివి ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు..

యాక్సిస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను జూలై 1, 2024 నుంచి సవరించినట్లు బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు ఎఫ్‌డీలకు వర్తిస్తాయి. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిపై సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.75% అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు 17 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 7.2% వరకు ఉంటుంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు..

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను జూలై 1, 2024 నుంచి సవరించినట్లు బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు మొత్తాలకు వర్తిస్తాయి. 12 నెలల కాలవ్యవధిలో సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 8.75% అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు 12 నెలల కాలవ్యవధిపై 8.25% ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు..

ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) కొత్త వడ్డీ రేట్లను జూలై 1, 2024 నుంచి అమలులోకి తీసుకువచ్చినట్లు బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు వరకూ వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.75% అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు 15 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య కాలవ్యవధిపై 7.2% వరకు ఉంటుంది.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు..

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను జూలై 1, 2024 నుంచి సవరించినట్లు బ్యాంక్ వెబ్‌సైట్ తెలిపింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు 666 రోజులలో అత్యధికంగా 7.80% వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు అదే వ్యవధిలో 7.3% వరకు ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు..

బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను జూన్ 30, 2024న సవరించింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి. 666 రోజుల వ్యవధిలో సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.80% అందిస్తుంది. సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు అదే వ్యవధిలో 7.3% వరకు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు