ఎఫ్‌డీ చేయాలనుకుంటే వెంటనే ‘ఎస్’ అనండి.. ఆ బ్యాంకులో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు..
Yes Bank FD: ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులు సవరిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడంతో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతోంది. ఇదే క్రమంలో ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఎస్ బ్యాంక్ తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది.

ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులు సవరిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడంతో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతోంది. ఇదే క్రమంలో ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఎస్ బ్యాంక్ తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. రూ. 2కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఎఫ్‌డీలపై ఆయా కాలపరిమితులకు అనుగుణంగా వడ్డీ పెంపు ఉంది. ఈ వడ్డీ రేటు ఎంత? దీనిని ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్ ఎఫ్సీ బ్యాంకులతో పోల్చితే ఎలా ఉంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎస్ బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు ఇలా..
ఎస్ బ్యాంక్ సవరించిన ఎఫ్‌డీ రేట్లు నవంబర్ 21, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. తాజా వడ్డీ పెంపు ప్రకారం, ఎస్ బ్యాంక్ ఇప్పుడు సాధారణ పౌరులకు 3.25% నుంచి 7.75% మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్‌లకు 3.75% నుంచి 8.25% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7.25%, ఒక సంవత్సరం నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో అయితే 7.50%, 18 నెలల నుంచి 24 నెలల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.75% రేటును చెల్లిస్తుంది.
ఎస్ బ్యాంక్ ఎఫ్‌డీ కొత్త వడ్డీ రేట్లు ఇలా..
- 7 రోజుల నుంచి 14 రోజులు – 3.25%
- 15 రోజుల నుంచి 45 రోజుల వరకు – 3.70%
- 46 రోజుల నుంచి 90 రోజులు – 4.10%
- 91 రోజుల నుంచి 120 రోజులు – 4.75%
- 121 రోజుల నుంచి 180 రోజులు – 5.00%
- 181 రోజుల నుంచి 271 రోజులు – 6.10%
- 272 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు – 6.35%
- 1 సంవత్సరం – 7.25%
- 1 సంవత్సరం 1 రోజు నుంచి 18 నెలల వరకు – 7.50%
- 18 నెలలు నుంచి 24 నెలలు లోపు – 7.75%
- 24 నెలల నుంచి 36 నెలల వరకు – 7.25%
- 36 నెలల నుంచి 60 నెలల వరకు – 7.25%
- 60 నెలలు – 7.25%
- 60 నెలలు 1 రోజు నుంచి 120 నెలల వరకు – 7%
ఇతర బ్యాంకులతో పోల్చితే..
- ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుతం సాధారణ కస్టమర్లకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3% నుంచి 7.1% వడ్డీని అందిస్తోంది, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 3.5% నుంచి 7.65%గా ఉంది.
- భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3% నుంచి 7.20% వడ్డీ రేటును అందిస్తోంది, సీనియర్ సిటిజన్‌లకు అయితే 3.5% నుంచి 7.75%గా ఉంది.
- ఎస్బీఐ సాధారణ కస్టమర్లకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3-7.1% వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై అదనపు 50 బేసిస్ పాయింట్లను పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..