AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender: 2000 నోట్ల నుండి యూపీఐ వరకు 2023లో బ్యాంకింగ్ వ్యవస్థలో 4 ప్రధాన మార్పులు

2023 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక పెద్ద మార్పులను చేసింది. 2,000 రూపాయల నోటును చలామణి నుండి ఉపసంహరించుకున్నప్పటి నుండి, UPIలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. తాజాగా ఆర్‌బీఐ యూపీఐ నిబంధనలను కూడా మార్చింది. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం.

Year Ender: 2000 నోట్ల నుండి యూపీఐ వరకు 2023లో బ్యాంకింగ్ వ్యవస్థలో 4 ప్రధాన మార్పులు
Rbi
Subhash Goud
|

Updated on: Dec 22, 2023 | 1:25 PM

Share

సంవత్సరం చివరి నెల ముగియడానికి 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 2023 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక పెద్ద మార్పులను చేసింది. 2,000 రూపాయల నోటును చలామణి నుండి ఉపసంహరించుకున్నప్పటి నుండి, UPIలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. తాజాగా ఆర్‌బీఐ యూపీఐ నిబంధనలను కూడా మార్చింది. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం.

  1. రూ. 2000 నోట్లు చెలామణిలో లేవు: ఈ ఏడాది మే 19న రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దుమారం రేగింది. మే 19, 2023న రూ. 2,000 నోటు చెలామణి నుండి తీసివేసింది. అంటే ఈ నోట్లు ఇకపై రిజర్వ్ బ్యాంక్‌లో ముద్రించదు. దీని వెనుక క్లీన్ నోట్ విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ ఉదహరించింది. రూ.2,000 నోట్లు చట్టవిరుద్ధం కానప్పటికీ, అవి ఇప్పటికీ చట్టబద్ధమైన చెల్లుబాటులో ఉన్నాయి. రూ.2000 నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా మార్చుకోవడానికి దాదాపు 4 నెలల సమయం ఇచ్చారు. ఇప్పటి వరకు 97 శాతం నోట్లు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి.
  2. అసురక్షిత రుణాలపై RBI చర్యలు: రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మీ జేబుపై భారం మరింత పెరగనుంది. రానున్న రోజుల్లో క్రెడిట్ కార్డులు లేక వినియోగదారుల రుణాలు తీసుకోవడానికి ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజానికి, RBI ఇప్పుడు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వినియోగదారుల క్రెడిట్ రుణాల రిస్క్ వెయిటేజీని 25 శాతం పెంచింది. అంటే అసురక్షిత రుణాలు మునిగిపోతాయనే భయం దృష్ట్యా, బ్యాంకులు ఇప్పుడు మునుపటి కంటే 25 శాతం ఎక్కువ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలకు వినియోగదారుల క్రెడిట్ రిస్క్ వెయిటేజీ 100 శాతంగా ఉంది. ఇప్పుడు దానిని 125 శాతానికి పెంచారు.
  3. UPIలో మార్పులు: ఈ ఏడాది UPI చెల్లింపు లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ పెంచింది. UPI లావాదేవీ పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలలో UPI లావాదేవీల కోసం ఈ సౌకర్యం అందిస్తోంది.
  4.  ఏప్రిల్ నుండి రెపో రేటు పెంచలేదు: ఏప్రిల్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అన్ని మానిటరీ పాలసీ సమావేశాల్లో రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతంగా ఉంది. రెపో రేటును చివరిసారిగా ఫిబ్రవరి 2023లో పెంచారు. సరళంగా చెప్పాలంటే, ద్రవ్యోల్బణం మరియు ప్రజల జేబులను దృష్టిలో ఉంచుకుని, RBI EMI ధరను పెంచలేదు.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి