మొదటిసారిగా ల్యాప్‌ట్యాప్‌లతో ‘ఎమ్ఐ’.. ధరలివే
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ.. తన ఎమ్ఐ బ్రాండ్ పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌లను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇంటి నుంచి పనిచేసే వారికి అనుకూలంగా ఉండేలా.. ఎంఐ నోట్ బుక్ 14 పేరుతో సరికొత్త నోట్‌బుక్‌లను విడుదల చేసింది షియోమీ సంస్థ. అలాగే అందరూ ఎదురు చూసినట్టుగానే హారిజన్ ఎడిషన్‌ను..

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ.. తన ఎమ్ఐ బ్రాండ్ పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌లను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇంటి నుంచి పనిచేసే వారికి అనుకూలంగా ఉండేలా.. ఎంఐ నోట్ బుక్ 14 పేరుతో సరికొత్త నోట్‌బుక్‌లను విడుదల చేసింది షియోమీ సంస్థ. అలాగే అందరూ ఎదురు చూసినట్టుగానే హారిజన్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. కాగా జూన్ 17వ తేదీ నుంచి.. అమెజాన్, షావోమి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
కాగా ప్రస్తుతం వీటి స్టార్టింగ్ రేట్స్ రూ.54,999 నుంచి రూ.41,999గా ఉన్నాయి. ఈ ప్రారంభ ధరలు జులై 16 వరకు మాత్రమే చెల్లుతాయని కంపెనీ ప్రకటించింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా వీటిని కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ రెండింటిపైనా రూ.2వేల తగ్గింపు అందిస్తోంది. అలాగే 9 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
ఎమ్ఐ నోట్‌బుక్ 14 ధరలు:
8 జీబీ ర్యామ్ + 246 జీబీ సాటా ఎస్ఎస్‌డీ – రూ.41,999 8 జీబీ ర్యామ్ + 512 జీబీ సాటా ఎస్ఎస్‌డీ – రూ.47,999 8 జీబీ ర్యామ్ + 512 జీబీ సాటా ఎస్ఎస్‌డీ + నివిడా జీ ఫోర్స్ ఎమ్ఎక్స్ 250 గ్రాఫిక్ కార్డ్ – రూ. 47,999
ఎమ్ఐ నోట్‌బుక్ 14 హరిజన్ ఎడిషన్:
8 జీబీ ర్యామ్ + 512 జీబీ సాటా ఎస్ఎస్‌డీ, ఇంటెన్ ఐ5 ప్రాసెసర్ – రూ.54,999 8 జీబీ ర్యామ్ + 512 జీబీ సాటా ఎస్ఎస్‌డీ, ఇంటెన్ ఐ7 ప్రాసెసర్ – రూ.59,999
Read more: కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రముఖ బాలీవుడ్ నటి బిల్డింగ్