Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో పెట్టుబడిన పెట్టిన డబ్బు రెట్టింపు

పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసే స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి..

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో పెట్టుబడిన పెట్టిన డబ్బు రెట్టింపు
Post Office Scheme
Follow us

|

Updated on: Oct 19, 2022 | 1:28 PM

పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసే స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌శాఖను మరింతగా బలోపేతం చేసింది. ఇక పోస్టాఫీసు పథకాలు దీర్ఘకాలిక పెట్టుబడులు. సాంప్రదాయ పెట్టుబడులను ఇష్టపడే వారికి, దీర్ఘకాలిక పెట్టుబడులు చేసే వారి కోసం ఈ పథకాలను రూపొందించారు. పోస్టాఫీసు పథకాలపై ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తోంది. అంటే ఈ పథకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే పెట్టుబడిపై హామీతో కూడిన రాబడి కూడా అందుబాటులో ఉంటుంది. పోస్టాఫీసులో ఉన్న పథకాలలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌ ఒకటి.

కిసాన్ వికాస్ పత్ర పథకం (కేవీపీ) అంటే ఏమిటి?

ఈ పథకం వ్యవధి 124 నెలలు. అంటే 10 సంవత్సరాల 4 నెలలు. మీరు ఈ స్కీమ్‌లో ఏప్రిల్ 1, 2022 నుండి జూన్ 30, 2022 వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు డిపాజిట్ చేసిన మొత్తం మొత్తం 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఎంత పెట్టుబడి పెట్టాలి?

ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. మీరు కనీసం రూ. 1,000 పెట్టుబడితో కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో మీకు కావలసినంత డబ్బు పెట్టవచ్చు. ఈ పథకం 1988లో ప్రారంభించబడింది. రైతుల పెట్టిన పెట్టుబడిని రెట్టింపు చేసేందుకు అప్పట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు ఈ పథకం అందరికీ అందుబాటులోకి వచ్చింది.

కావలసిన పత్రాలు

ఈ పథకంలో పెట్టిన పెట్టుబడికి తగిన పత్రాలు కావాల్సి ఉంటుంది. 2014లో ప్రభుత్వం రూ.50,000 కంటే ఎక్కువ పెట్టుబడులకు పాన్ కార్డును తప్పనిసరి చేసింది. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఐటీఆర్, వేతన స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ మొదలైన ఆదాయ రుజువు కూడా సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు గుర్తింపు కార్డుగా కూడా ఆధార్ ఇవ్వాల్సి ఉంది.

ఈ పథకంపై హామీతో కూడిన రాబడి అందుబాటులో ఉంది. దీనికి మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేదు. ఇది పెట్టుబడికి చాలా సురక్షితమైన మార్గం. మీరు టర్మ్ ముగింపులో పూర్తి మొత్తాన్ని పొందుతారు. అలాగే ఇందులో ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభించదు. దీనిపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీ తర్వాత ఉపసంహరణలు పన్ను విధించబడదు. మీరు మెచ్యూరిటీపై మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు, అంటే 124 నెలల తర్వాత కానీ దాని లాక్-ఇన్ వ్యవధి 30 నెలలు. దీనికి ముందు, ఖాతాదారు చనిపోతే లేదా కోర్టు ఉత్తర్వు ఉంటే తప్ప మీరు పథకం నుండి డబ్బును ఉపసంహరించుకోలేరని గుర్తించుకోండి. ఇందులో రూ.1000, రూ.5000, రూ.10000, రూ.50000 డినామినేషన్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే మీరు కిసాన్ వికాస్ పత్రాన్ని తాకట్టుగా లేదా సెక్యూరిటీగా ఉంచడం ద్వారా కూడా రుణం తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి