Post Office Scheme: కేవలం రూ.755 పెట్టుబడితో రూ.15 లక్షలు మీ సొంతం.. పోస్టాఫీస్‌లో ఎవరికీ తెలియని అద్భుత స్కీమ్.. ఛాన్స్ మిస్సవ్వకండి
బ్యాంకులకు పోటీగా పోస్టల్ శాఖ ప్రజలకు లాభం చేకూర్చేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా పోస్టాఫీసులో ఓ ప్రమాద బీమా ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. దీని వివరాలు ఇప్పుడు తెలసుకుందాం.

ప్రజలు తమ డబ్బులను పొదుపు చేసుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వీటి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. దీంతో పాటు వీటిల్లో పెట్టే పెట్టుబడికి 100 శాతం భద్రత ఉంటుంది. ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నప్పటికీ చాలామందికి తెలియక ఉపయోగించుకోరు. ఈ స్కీమ్స్ గురించి ప్రజలకు బ్యాంకులు, పోస్టాఫీసులు విస్తృతంగా ప్రచారం చేయకపోవడంతో ప్రజలను అవగాహన ఉండటం లేదు. పోస్టాఫీస్‌లో సామాన్య ప్రజల కోసం అద్భుత ప్రమాద బీమా పథకం ఒకటి అందుబాటులో ఉంది. దీని ప్రయోజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యక్తిగత ప్రమాద బీమా పథకం
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. హెల్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ అనే రెండు విభాగాల్లో మొత్తం 3 పథకాలను అందిస్తుంది. టాటా ఏఐజీ, బజాజ్ అలియాంజ్ సంస్థలతో భాగస్వామ్యంతో ఈ ప్లాన్లు అమలు చేస్తోంది. 16 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. సంవత్సరానికి ఒకేసారి ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇందులో పొందవచ్చు. ఒక వ్యక్తికి రూ.755 పెట్టుబడితో రూ.15 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. వాహనాల డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు ఈ ప్రమాద బీమా ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
హెల్త్ ప్లస్ ఆప్షన్ 1
ఈ ప్లాన్ రూ.5 లక్షల బీమాను అందిస్తుంది. ప్రమాదశాత్తూ మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా కుటుంబానికి పూర్తి సాయం అందుతుంది. దీనికి వార్షిక ప్రీమియం రూ.355 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
హెల్త్ ప్లస్ ఆప్షన్ 2
ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తికి రూ.10 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. వార్షిక ప్రీమియం రూ.555 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షలు అందుతుంది. ఇక హెల్త్ ప్లస్ ఆప్షన్ 3 ఎంచుకుంటే రూ.15 లక్షల బీమా అందుతుంది. దీని ప్రీమియం రూ.755గా ఉంది.
ఎలా తీసుకోవాలి..?
మీ దగ్గర్లోని పోస్టాఫీసుల ద్వారా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇక ఇక పోస్టల్ శాఖ సేవింగ్ అకౌంట్ ఉన్నవారు ఇండియన్ పోస్ట్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పోస్టల్ శాఖ ఉద్యోగిని సంప్రదించి కూడా పాలసీ తీసుకోవచ్చు.
