Gold Price: బంగారం ధర రూ.70 వేలకు తగ్గుతుందా..? నిపుణులు చెప్పేది వింటే అవాక్కవుతారు..
బంగారం ధరల్లో భారీ సునామీ రాబోతోందా? రూ. 1.50 లక్షల పైచిలుకు ఉన్న పసిడి ధర ఏకంగా రూ.70 వేలకు పడిపోనుందా? డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు బంగారం మార్కెట్‌ను ఎలా తలకిందులు చేయబోతున్నాయి? పసిడి ప్రియులు, పెట్టుబడిదారులు ఇప్పుడు ఏం చేయాలి? అనేది తెలుసుకుందాం..

గత కొంత కాలంగా సామాన్యులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అంతకంతకు పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.54లక్షలు ఉంది. అయితే ఈ ధరలు లక్షకు దిగువకు పడిపోతాయా..? గతంలో మాదిరి రూ.70 వేలకు చేరుకుంటుందా..? ఎందుకంటే బంగారం రూ.70వేలకు చేరుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. మరి ఇందులో నిజమెంత..? నిపుణులు ఏమంటున్నారు..? అనేది ఇప్పడు తెలుసుకుందాం..
ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు ఇవే..
బంగారం ధరలపై ఒత్తిడి పెరగడానికి అంతర్జాతీయంగా రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి..
అమెరికా ఆర్థిక విధానాలు: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల డాలర్ విలువ విపరీతంగా పెరుగుతోంది. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం ధర తగ్గుతుంది. పెట్టుబడిదారులు పసిడిని వదిలి ఇతర ఆర్థిక వనరుల వైపు మొగ్గు చూపుతున్నారు.
తగ్గిన యుద్ధ భయాలు: గతంలో రష్యా-ఉక్రెయిన్, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల బంగారం ధరలు పెరిగాయి. ఇప్పుడు యుద్ధ మేఘాలు తొలగిపోతుండటంతో ఇన్వెస్టర్లు గోల్డ్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, స్టాక్ మార్కెట్లలో పెడుతున్నారు.
రూ. 70,000 మార్కు సాధ్యమేనా..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధర రూ. 70,000 కి పడిపోవడం అసాధ్యమేమీ కాదు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర కీలక మద్దతు స్థాయిని కోల్పోయినా లేదా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడినా దిగుమతి ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా క్షీణించే అవకాశం ఉంది.
కొనుగోలుదారులకు నిపుణుల సలహా
బంగారం ధరల తగ్గుదల అనేది ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. ఇది దశలవారీగా జరుగుతుంది. కాబట్టి పెళ్లిళ్ల సీజన్ అని కంగారుపడి ఒకేసారి మొత్తం బంగారం కొనవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు తగ్గిన ప్రతిసారీ కొద్దికొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమం. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు వద్దు. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం మంచి పెట్టుబడి, కాబట్టి ఓపికతో సరైన సమయం కోసం వేచి చూడండి.
ప్రస్తుతం మార్కెట్ గందరగోళంగా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని గమనిస్తూ, నిపుణుల సలహా మేరకే మీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




