AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం.. అప్పటివరకే టైమ్..

ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్. యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అప్డేట్ చేయించుకునే అవకాశం కల్పిస్తోంది. సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇది వీరికి మాత్రమే అందుబాటులో ఉంటుందని యూఐడీఏఐ తెలిపింది.

Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం.. అప్పటివరకే టైమ్..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Aug 23, 2026 | 6:49 PM

Share

ఆధార్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. అప్పుడే పుట్టిన పసి పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు అందరూ తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన గుర్తింపు ధృవీకరణ పత్రం. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. ఇలా ప్రతీ పనికి ఇది ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలు స్కూల్‌లో అడ్మిషన్, స్కాలర్ షిప్ వంటివి పొందాలన్నా లేదా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధార్ తీసుకోవాలి. అయితే ఇలా తీసుకున్న ఆధార్‌ను వాళ్లు కాస్త పెద్దయ్యాక అప్డేట్ చేయాలి. బయోమెట్రిక్స్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయించాలి. ఇది ఎలా అనేది చూద్దాం.

అప్డేట్ చేయించడం తప్పనిసరి

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనంలో ఆధార్ తీసుకుంటారు. కానీ కాస్త పెద్దయ్యాక దానిని అప్డేట్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు వారి బయోమెట్రిక్స్ వివరాలు నమోదు చేయరు. పెద్దయ్యాక వాటిని అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. దీంతో 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్‌ను అప్డేట్ చేయించడాన్ని యూఐడీఏఐ తప్పనిసరి చేసింది. ఈ వయస్సు ఉన్న పిల్లలతో వారి తల్లిదండ్రులు బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించాలి. లేకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశముంది. ఉచితంగా అప్డేడ్ చేయించుకునే అవకాశం యూఐడీఏఐ కల్పిస్తోంది. సమీపంలోని ఏదైనా ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్డేట్ చేయించవచ్చు. సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అప్డేట్ చేయించుకునే అవకాశం యూఐడీఏఐ అందుబాటులోకి తెచ్చింది.

సెప్టెంబర్ 30 తర్వాత నో ఫ్రీ..

సెప్టెంబర్ 30 తర్వాత ఉచిత సేవలు అందుబాటులో ఉండవు. ఆ తర్వాత ఆధార్ అప్డేట్ చేయించాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. పిల్లల బయోమెట్రిక్స్ అప్డేడ్ చేయించకపోతే స్కూల్ అడ్మిషన్స్, స్కాలర్ షిప్స్, ఇతర పనుల్లో జాప్యం జరిగే అవకాశముంది. సెప్టెంబర్ 30 తర్వాత అప్డేట్ చేయించాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుందని, ఇప్పుడు ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఐదేళ్లలోపు పిల్లలకు బాల ఆధార్ జారీ చేస్తారు. ఈ సమయంలో వారి ఐరిస్, వేలిముద్రలు వంటివి తీసుకోరు. కేవలం పిల్లల ఫొటో,తల్లిదండ్రుల ఆధార్ వివరాల ఆధారంగా బల ఆధార్ జారీ చేస్తారు. దీంతో ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా అప్డేట్ చేయించాలి. వయస్సు పెరిగేకొద్ది బయోమెట్రిక్ వివరాలు మారుతూ ఉంటాయి. దీంతో 15 ఏళ్ల తర్వాత మరోసారి అప్డేట్ చేయించాల్సి ఉంటుంది.

Follow Us