మైక్రోసాఫ్ట్‌తో జియో ఒప్పందం… డిజిటల్ ఇండియాకు కొత్త రూపు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి తెర తీసింది. ఇప్పటికే ‘జియో’తో హాల్ చల్ చేస్తుండగా, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా ప్రముఖ, నంబర్ వన్ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో జత కట్టింది. భారత డిజిటల్ రూపును దేదీప్యమానంగా వెలిగించేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుండగా, దానికి అవసరమయ్యే ‘అజుర్’ కంప్యూటర్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ అందించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ […]
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి తెర తీసింది. ఇప్పటికే ‘జియో’తో హాల్ చల్ చేస్తుండగా, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా ప్రముఖ, నంబర్ వన్ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో జత కట్టింది. భారత డిజిటల్ రూపును దేదీప్యమానంగా వెలిగించేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుండగా, దానికి అవసరమయ్యే ‘అజుర్’ కంప్యూటర్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ అందించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ కంపెనీ ఏజీఎం సమావేశంలో వెల్లడించారు.
అంతేకాదు, భారతీయ టెక్నాలజీ స్టార్టప్‌లకు జియో కనెక్టివిటీతో పాటు జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్‌ను ఉచితంగానే అందించనున్నట్లు ముఖేశ్ అంబానీ వెల్లడించారు. చిన్న స్థాయి వ్యాపార సంస్థలకు అవసరమయ్యే కనెక్టివిటీ సమూహాన్ని, ఆటోమేషన్ టూల్స్‌ను నెలకు కేవలం రూ.1500కే అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
.@Microsoft's @satyanadella sends his message on #JioMicrosoft partnership at #RIL42ndAGM "As part of this alliance, Jio will set up large data centres across India, Microsoft will bring Azure platform to Jio," says #MukeshAmbaniWatch the #RILAGM here ?: https://t.co/XxjzDpKbEU pic.twitter.com/2FEW59OxDI
— moneycontrol (@moneycontrolcom) August 12, 2019