కొండెక్కిన బంగారం ధర.. ఇండియాలో కంటే డబుల్ రేట్స్ అక్కడే..

బంగారం ధరలు రోజురోజుకి కొండెక్కి కూర్చుంటున్నాయి. పెట్టుబడి దారులకు ఇది శుభవార్తే అయినా.. కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్ అవుతుంది. రానున్న రోజుల్లో బంగారం కొనాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి కలుగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌లో బంగారం ధర వింటే గుండె వణకాల్సిందే. ఇండియాతో పోలిస్తే.. పాకిస్తాన్‌లో బంగారం ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది. సోమవారం పాకిస్తాన్‌లో పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 74,588గా ఉంది. పాకిస్తాన్ పరిణామంలో తులాబార్స్ 11 గ్రాముల బంగారం ధర రూ. […]

కొండెక్కిన బంగారం ధర.. ఇండియాలో కంటే డబుల్ రేట్స్ అక్కడే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2019 | 11:04 AM

బంగారం ధరలు రోజురోజుకి కొండెక్కి కూర్చుంటున్నాయి. పెట్టుబడి దారులకు ఇది శుభవార్తే అయినా.. కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్ అవుతుంది. రానున్న రోజుల్లో బంగారం కొనాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి కలుగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌లో బంగారం ధర వింటే గుండె వణకాల్సిందే. ఇండియాతో పోలిస్తే.. పాకిస్తాన్‌లో బంగారం ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది. సోమవారం పాకిస్తాన్‌లో పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 74,588గా ఉంది. పాకిస్తాన్ పరిణామంలో తులాబార్స్ 11 గ్రాముల బంగారం ధర రూ. 87,000గా ఉంది. అయితే పాకిస్తాన్‌లోని ఒక్కో నగరంలోనూ ఒక్కో రేటు పలుకుతోంది.

మరోవైపు దేశీయంగా బంగారం రేట్లు రూ. 38వేలు మార్క్‌ను అధిగమించాయి. ఇక త్వరలో రూ.40వేలకు చేరుకుంటుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెండి కూడా దాదాపు బంగారం రేంజ్‌లో పరుగులు పెడుతోంది.