Black Friday: బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటి.? అసలు ఎలా మొదలైంది..
ఏడాది చివరిలో బ్లాక్ ఫ్రైడే పేరుతో సేల్ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో ఈ సేల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ బ్లాక్ ఫ్రైడే అనే సంస్కృతి ఎలా వచ్చింది.? ఎప్పటి నుంచి ఈ ట్రెండ్ ప్రారంభమైంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు అమెరికాలో బ్లాక్ ఫ్రై డే పేరుతో సేల్ నిర్వహిస్తుంటారు. సంవత్సరంలో అతిపెద్ద షాపింగ్ డేగా ఈ సేల్‌ను చెబుతుంటారు. ఒకప్పుడు కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలోనూ అమలు చేస్తున్నారు. అమెజాన్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్‌ను భారత్‌లో అమలు చేస్తున్నాయి. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అనే పదం ఎలా వచ్చింది.? అసలు ఈ ట్రెండ్ ఎలా ప్రారంభమైంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లాక్ ఫ్రైడే అనే పదం మొదటిసారి 1960లో వెలుగులోకి వచ్చింది. ఫిలడెల్ఫియా అనే నగరంతో ఈ పేరు ముడిపడింది. ఆ సమయంలో శుక్రవారం థాంక్స్ గివింగ్ తర్వాత ప్రజలు షాపింగ్ కోసం బయటకు వెళ్లేవారు దీంతో వీధుల్లోకి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకునేవారు. ఈ కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగేది. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడానికి అధికారులు సైతం ఎంతో ఇబ్బంది పడేవారు. ఈ కారణంగానే దీనికి బ్లాక్ ఫ్రైడే పేరును ఖరారు చేశారు.
కాగా 1980 తర్వాత కొందరు వ్యాపారులు బ్లాక్ ఫ్రైడేకి కొత్త అర్థాన్ని ఇచ్చారు. బ్లాక్ ఫ్రైడే రోజున వ్యాపారుల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో బ్లాక్ వారికి ఒక సెంటిమెంట్‌గా మారింది. బ్లాక్ ఫ్రైడే అంటేనే లాభాలుగా పరిగణించడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడేను అనుసరిస్తున్నారు. పెద్ద షాపింగ్ ఈవెంట్‌ను జరుపుకుంటారు. ఇందులో భాగంగా యూజర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఆఫర్లను, డిస్కౌంట్లను అందిస్తుంటారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా భారత్‌లో బ్లాక్ ఫ్రైడేను ఈ కామర్స్ సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు పలు గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..