AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cibil Score: సిబిల్ స్కోర్ 700 దాటితే బోలెడు బెనిఫిట్స్! అవేంటంటే…

క్రెడిట్ కార్డు లేదా లోన్ వంటివి పొందాలంటే దానికి సిబిల్ స్కోర్ చాలా కీలకం. సిబిల్ స్కోర్ 650 పాయింట్లు దాటితో మంచి స్కోర్ కింద పరిగణిస్తారు. ఒకవేళ మీ స్కోర్ 700 దాటితే మీది ఎక్స్ లెంట్ స్కోర్ కింద లెక్క. ఈ స్కోర్ ఉన్నవాళ్లకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే..

Cibil Score: సిబిల్ స్కోర్ 700 దాటితే బోలెడు బెనిఫిట్స్! అవేంటంటే...
Cibil Score
Nikhil
|

Updated on: Oct 06, 2025 | 3:59 PM

Share

మీ ఫైనాన్సియల్ హిస్టరీని బట్టి కొన్ని క్రెడిట్ ఏజెన్సీలు సిబిల్ స్కోర్ ను అంచనా వేస్తాయి. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే మీరు ఆర్థికంగా అంత బాధ్యతాయుతంగా ఉన్నారని అర్థం. అందుకే ఎక్కువ స్కోర్ ఉన్నవాళ్లకు త్వరగా లోన్స్ అప్రూవ్ అవుతుంటాయి. అయితే క్రెడిట్ స్కోర్ లో 700 అనేది బెంచ్ మార్క్ వంటిది. మీ స్కోర్ 700 దాటితే మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఇవీ..

తక్కువ వెరిఫికేషన్

సిబిల్ స్కోర్ 700 దాటిన వాళ్లకు తక్కువ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. చాలా తక్కువ డాక్యుమెంటేషన్ తోనే లోన్ అప్రూవ్ అవుతుంది. ఒకవేళ స్కోర్ తక్కువ ఉంటే ఎక్కువ పత్రాలు సమర్పించాల్సి వస్తుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది.

తక్కువ ఇంట్రెస్ట్ రేట్

సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉన్నవారికి కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకి లోన్ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే స్కోర్ లో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా 700 పైన మెయింటెయిన్ అవుతుంటే ఈ బెనిఫిట్ ఉంటుంది.

ఎక్కువ లోన్ అమౌంట్

సిబిల్ స్కోర్ 700 దాటిన వాళ్లు లోన్ అమౌంట్ కూడా పెరుగుతుంది. 650 పాయిట్ల ఉన్నవారికంటే రెట్టింపు లోన్ అమౌంట్ ను వీళ్లకు లభిస్తుంది. అలాగే వీళ్లకు ఇప్పటికే ఉన్న లోన్ కి తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది.

ప్రీమియం క్రెడిట్ కార్డ్స్

సిబిల్ స్కోర్ 700 పాయింట్లు మెయింటెయిన్ చేస్తున్నవాళ్లకు బ్యాంకులు ప్రీమియం క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తుంటాయి. వీటివల్ల రివార్డ్ పాయింట్స్, షాపింగ్ డిస్కౌంట్స్ వంటి అదనపు బెనిఫిట్స్ పొందొచ్చు.

మరిన్ని పర్సనల్‌ ఫైనాన్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
మాట నిలబెట్టుకుంటోన్న బండ్ల గణేష్.. 19న మరో సాహసానికి శ్రీకారం
మాట నిలబెట్టుకుంటోన్న బండ్ల గణేష్.. 19న మరో సాహసానికి శ్రీకారం
చింతపండుతో ఇన్ని వెరైటీలా? ఇలా చేస్తే నోరూరడం గ్యారెంటీ!
చింతపండుతో ఇన్ని వెరైటీలా? ఇలా చేస్తే నోరూరడం గ్యారెంటీ!