CIBIL Score Tips: సిబిల్ స్కోర్ ఇలా ఉంటే.. వద్దన్నా లోన్లు ఇస్తామంటారు.. ఎలా మెయింటేన్ చేయాలంటే..

ఫైనాన్షియల్ రంగంలో సిబిల్ స్కోర్ అనేది చాలా ప్రాధాన్య అంశం. ముఖ్యంగా లోన్లకు కోసం దరఖాస్తు చేసే వారి సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ ను ఆర్థిక సంస్థలు తనిఖీ చేస్తాయి. సాధారణంగా ఈ సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కి పైన స్కోర్ ఉన్న ఖాతాదారులకు సులభంగా లోన్లు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రయోజనకరంగా ఉంటుంది.

CIBIL Score Tips: సిబిల్ స్కోర్ ఇలా ఉంటే.. వద్దన్నా లోన్లు ఇస్తామంటారు.. ఎలా మెయింటేన్ చేయాలంటే..
Cibil Score
Follow us
Madhu

|

Updated on: Sep 23, 2023 | 11:55 AM

మనిషికి ఆశలు, ఆకాంక్షలు పెరిగిపోతున్నాయి. లగ్జరీగా కాకపోయినా.. ఉన్నదానిలో ఉత్తమంగా జీవించాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ప్రధానంగా తినడానికి మూడు పూట్ల తిండితోపాటు ఓ సొంత ఇల్లు, ఓ సొంత వాహనం, ఇంట్లో సామగ్రి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అందరూ రుణాల బాట పడుతున్నారు. పర్సనల్ లోన్లనీ.. కార్ లోన్లనీ, హోమ్ లోన్లనీ, క్రెడిట్ కార్డు లోన్లనీ తీసుకుంటున్నారు. వాటిని సులభవాయిదాలలో కట్టుకుంటూ తన కావాల్సినవి తీసుకుంటున్నారు. అయితే ఈ లోన్లు మీకు రావాలంటే ప్రధానమైన అంశం సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్. మీరు ఇప్పటికే ఏమైనా లోన్లు తీసుకుని ఉంటే.. దీని గురించి ఇప్పటికే ఓ అవగాహన వచ్చి ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే మీకు ఏ లోన్ అయినా మంజూరు అవుతుంది. మరి ఇంత ప్రాధాన్య ఉన్న సిబిల్ స్కోర్ ఆరోగ్యవంతంగా కొనసాగించడం ఎలా? అదే నండి అన్నీ లోన్లు మంజూరయ్యే విధంగా చేసుకోవడం ఎలా? అసలు స్కోర్ ఎంత ఉంటే లోన్లు సులభంగా వస్తాయి? నిపుణులు చెబుతున్న సూచనలు ఓ సారి చూద్దాం..

మంచి సిబిల్ స్కోర్ ఇది..

ఫైనాన్షియల్ రంగంలో సిబిల్ స్కోర్ అనేది చాలా ప్రాధాన్య అంశం. ముఖ్యంగా లోన్లకు కోసం దరఖాస్తు చేసే వారి సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ ఆర్థిక సంస్థలు తనిఖీ చేస్తాయి. సాధారణంగా ఈ సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కి పైన స్కోర్ ఉన్న ఖాతాదారులకు సులభంగా లోన్లు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రయోజనకరంగా ఉంటుంది.

మంచి సిబిల్ స్కోర్ ఎలా మెయింటేన్ చేయాలి..

మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచడానికి స్థిరమైన బాధ్యతాయుతమైన ఆర్థిక పద్ధతులు అవసరం. మీ క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో చూద్దాం..

ఇవి కూడా చదవండి
  • మీ క్రెడిట్ నివేదికను తరచూ తనిఖీ చేయాలి. దీని వల్ల మీ స్కోర్‌ను ప్రభావితం చేసే లోపాలను గుర్తించే అవకావం ఉంటుంది.
  • మీ క్రెడిట్ కార్డు బిల్లలను సకాలంలో చెల్లించాలి. అందుకోసం అవసరమైతే రిమైండర్‌లను సెట్ చేసుకోండి.
  • మీ క్రెడిట్ కార్డు వినియోగాన్ని తగ్గించాలి. మొత్తం లిమిట్ నుంచి 30% వరకూ క్రెడిట్ కార్డ్ వినియోగించాలి.
  • ఒకే తరహా లోన్లు అధికంగా తీసుకోవద్దు. విభిన్న లోన్లు తీసుకోండి. అంటే రెండు మూడు పర్సనల్ లోన్లు కాకుండా.. ఒక పర్సనల్ లోన్, మరొకటి గోల్డ్ లోన్, ఇంకొటి వాహన లోన్ అలా వైవిధ్యపరచడం మేలు.
  • తక్కువ వ్యవధిలో లోన్ల కోసం ఎక్కువ దరఖాస్తు చేయొద్దు.
  • సురక్షిత క్రెడిట్‌ని ఉపయోగించడం మేలు.
  • పేరుకుపోయిన బాకీలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం ఉత్తమం.
  • బడ్జెట్ రూపొందించడం, ప్రణాళిక ప్రకారం ఖర్చుల చేయడం నేర్చుకోవాలి. అలాగే రుణ చెల్లింపులు, పొదుపులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఇవన్నీ పాటిస్తూ ఓపికగా ఉండాలి. ఇవి సత్ఫలితాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. మీ స్కోర్ కాలక్రమేణా పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..