EPS డబ్బులు విత్‌ డ్రా చేయాలంటే కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే..! లేదంటే సాధ్యంకాదు..

EPFO: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం చేసేవారికి

EPS డబ్బులు విత్‌ డ్రా చేయాలంటే కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే..! లేదంటే సాధ్యంకాదు..
Pf Money
Follow us

|

Updated on: Oct 02, 2021 | 9:52 PM

EPFO: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం చేసేవారికి ఈ ఫండ్ నుంచి పెన్షన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం జీతంలో కొంత భాగం పెన్షన్ ఫండ్‌కు కలుపుతారు. పనిచేసే కంపెనీ, ఉద్యోగి ఇద్దరూ ఇపిఎఫ్‌కు సహకరించాలి. తద్వారా ఉద్యోగి విరమణ చేస్తే పెన్షన్‌గా కొంత మొత్తాన్ని పొందుతాడు. పెన్షన్ మొత్తం రూ.1000 నుంచి రూ .7500 వరకు ఉంటుంది. కానీ EPS డబ్బు మీ అకౌంట్‌లో స్వయంచాలకంగా జమకాదు. దీని కోసం ఫారం 10 సి నింపాల్సి ఉంటుంది.

ఫారం 10 సి అంటే ఏమిటి EPS ప్రయోజనాన్ని పొందడానికి ఫారం 10C అత్యంత ముఖ్యమైన పత్రం. కంపెనీ మీ జీతం నుంచి PF పేరుతో తీసివేసే డబ్బు రెండు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం EPF లో డిపాజిట్ అవుతుంది. మరొక భాగం EPS లో జమ అవుతుంది. EPF పేరిట జీతం నుంచి 12 శాతం తీసివేస్తారు. దీనికి కంపెనీలు 12 శాతం జోడించి డిపాజిట్ చేస్తాయి. అయితే మొత్తం డబ్బు పిఎఫ్‌లో డిపాజిట్ కాదు. దీనిలో కొంత మొత్తాన్ని తీసివేసి EPSలో డిపాజిట్ చేస్తారు. తర్వాత ఈ ఫండ్‌ పెన్షన్‌కు ఉపయోగపడుతుంది. EPSలో డిపాజిట్ చేసిన డబ్బును పొందడానికి మాత్రమే ఫారం10C నింపాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఫారం 10C ని ఎలా పూరించాలి 1. ముందుగా EPF వెబ్‌సైట్ www.epfindia.gov.in కి వెళ్లండి 2. మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌తో పోర్టల్‌కి లాగిన్ కండి 3. పైన కనిపించే మెనూ బార్‌లో ఆన్‌లైన్ సేవలు ఉంటాయి. దానిపై క్లిక్ చేయండి 4. ఇప్పుడు డ్రాప్‌డౌన్ మెనూకు వెళ్లి, క్లెయిమ్ ఫారం 10C, 19, 31 ని ఎంచుకోండి 5. వెంటనే మీరు తదుపరి పేజీకి వెళుతారు. ఇక్కడ మీరు సభ్యుల వివరాలను పొందుతారు. సర్వీస్ వివరాలు, KYC వివరాల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది 6. ఇప్పుడు ఆదాయాల ఆన్‌లైన్ క్లెయిమ్ బటన్‌పై క్లిక్ చేయండి 7. ఇక్కడ నుంచి మీరు క్లెయిమ్ విభాగానికి వెళుతారు. ఇక్కడ మీరు PAN నంబర్, మొబైల్ నంబర్, UAN నంబర్ వివరాలను పొందుతారు 8. ఇక్కడ క్లెయిమ్ రకాన్ని ఎంచుకోండి. పిఎఫ్ విత్‌డ్రా మాత్రమే లేదా పెన్షన్ విత్‌డ్రా మాత్రమే ఎంచుకోవాలి 9. ఫారమ్ నింపిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఫారమ్‌లో నమోదు చేయండి. దీనితో క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది 10. ఫారమ్‌ను విజయవంతంగా పూరించిన తర్వాత మొబైల్‌కి SMS వస్తుంది. అది నోటిఫికేషన్ అవుతుంది. 11. మీ క్లెయిమ్ ఖరారు అయిన వెంటనే EPS డబ్బు మీ ఖాతాకు బదిలీ అవుతుంది.

Payal Rajput: సొగసు చూడతరమా.. పాయల్ పరువాలు పొగడతరమా… మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ..

Siddharth Tweet: నెట్టింట తెగ వైరలవుతోన్న హీరో సిద్దార్థ్ లేటెస్ట్ ట్వీట్..

RR vs CSK, IPL 2021: రుతురాజ్ సెంచరీతో చెన్నై టీం భారీ స్కోర్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 190