SBI Offer: పండగ సీజన్‌లో కస్టమర్లకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. క్యాష్‌బ్యాక్.. ఆ మూడు రోజులే..!
SBI Offer: పండగ సీజన్ వచ్చేస్తోంది. వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి ఆయా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

SBI Offer: పండగ సీజన్ వచ్చేస్తోంది. వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి ఆయా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారుల కోసం దమ్‌దార్ దస్ పేరుతో పండుగ ఆఫర్ ప్రకటించింది. క్రెడిట్ కార్డ్స్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చని వెల్లడించింది. అంతేకాదు ఈఎంఐ కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది.
దసరా, దీపావళి పండుగ సీజన్ వచ్చేసింది. ఇందుకు తగినట్లుగానే ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు జోరందుకుంటుంది. కార్డుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగ సీజన్ కాబట్టే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 3 నుంచి కేవలం మూడు రోజులపాటు ఉంటుంది.
ఆన్‌లైన్‌లో మొబైల్స్, అప్లియెన్సెస్, హోం డెకర్.. తదితర కొనుగోళ్లకు దమ్‌దార్ దస్ ఆఫర్ వర్తిస్తుంది. బీమా, యాత్రలు, వాలెట్, ఆభరణాలు, విద్య, ఆరోగ్యం, పౌర సేవలకు ఇది వర్తించదు అని కంపెనీ తెలిపింది. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు రకరకాల ఆఫర్లను అందిస్తోంది. పండగ సీజన్‌లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఆఫర్లను అందిపుచ్చుకునే వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.