Silver Price Today: పెరిగిన వెండి ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!

Silver Price Today: పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. దీంతో పాటు వెండి కొనుగోళ్లు బాగానే జరుగుతుంటాయి..

Silver Price Today: పెరిగిన వెండి ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 03, 2021 | 5:47 AM

Silver Price Today: పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. దీంతో పాటు వెండి కొనుగోళ్లు బాగానే జరుగుతుంటాయి. భారతీయులు వెండి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే వెండితే తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి భారీగానే పెరిగింది. ఆదివారం (అక్టోబర్‌ 3)న కిలో వెండిపై రూ.1000 వరకు పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ప్రాంతాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.60,500 ఉండగా, చెన్నైలో రూ.64,600 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,500 ఉండగా, కోల్‌కతాలో రూ.60,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,500 ఉండగా, కేరళలో రూ.64,600 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,600 ఉండగా, విజయవాడలో రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా ఉన్న వెండి ధరలు ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: మళ్లీ దూసుకుపోతున్న బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..!

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే.. రూ.3,300 పెన్షన్‌..!

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది..!

Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్‌ అథెంటికేషన్‌ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!