Indians Spending: భారత వినియోగదారులు వేటికోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో తెలుసా..?
Indians Spending: భారతీయ వినియోగదారులు విచక్షణతో ఖర్చుచేయటం పెంచడం ప్రారంభించారు. భవిష్యత్తులో అనిశ్చితుల గురించి జాగ్రత్తగా ఉండేందుకు, మరింత ఆదా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేధికల ప్రకారం తెలుస్తోంది.
Indians Spending: భారతీయ వినియోగదారులు విచక్షణతో ఖర్చుచేయటం పెంచడం ప్రారంభించారు. భవిష్యత్తులో అనిశ్చితుల గురించి జాగ్రత్తగా ఉండేందుకు, మరింత ఆదా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డెలాయిట్ కన్జూమర్ ట్రాకర్ నివేదిక చెబుతోంది. దేశంలోని 14 శాతం మంది ఆన్ లైన్ షాపింగ్ కోసం తమ డబ్బును వెచ్చిస్తున్నట్లు తేలింది. ఇదే శాతాన్ని కుటుంబపోషణకు, శుభకార్యాల వంటి వాటికి ఖర్చు చేస్తున్నారు. ప్రతి 10 మందిలో ఏడుగురు.. రానున్న ఆరు నెలల కాలంలో కొత్త వాహనాలను కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ వివరాలు చెబుతున్నాయి. 2022లో 91 శాతం మంది భారతీయులు తమ డ్రీమ్ వెకేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. 87 శాతం మంది జీవితకాలంలో ఒకసారి వెళ్లాలనుకునే పర్యటనలను ఈ సంవత్సరంలోనే ప్లాన్ చేసుకుంటున్నట్లు గ్రోబల్ ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్టు చెబుతోంది.
ఇదే కాలంలో 83 శాతం మంది రానున్న మూడు నెలల కాలంలో తమ వృత్తిపరమైన పనులకోసం ప్రయాణాలు చేయాలనుకుంటున్నారని తేలింది. దేశంలో 35 నుంచి 54 ఏళ్ల మధ్య వారిలో అత్యధికంగా 87 శాతం మంది.. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో పక్క అధిక ధరల కారణంగా 61 శాతం మంది వినియోగదారులు తమ ఖరీదైన కొనుగోళ్లను వాయిదా వేసుకోగా.. 54 శాతం మంది తమ సేవింగ్స్ ను మరింతగా పెంచుకున్నారు. దేశంలోని 77 శాతం మంది రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే సానుకూల ధృక్పదంతో ఉన్నారని సర్వే వివరాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి..
Stock Market: భారీగా తగ్గిన ఐపీఓల రాక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులే కారణమా..