AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులుండడం నేరమా? నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..

పాన్‌ కార్డుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కచ్చితమైన నియమాలను నిర్దేశించింది. వాటి ప్రకారం.. దేశంలో ఒక వ్యక్తి ఒక్క పాన్‌ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. అంతకు మించి ఉండడం నేరం. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్క కార్డు మాత్రమే జారీ చేస్తారు. దాన్నివేరొకరికి బదిలీ చేయరు.

PAN Card: ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులుండడం నేరమా? నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..
Pan Card
Madhu
|

Updated on: Sep 17, 2024 | 3:22 PM

Share

దేశంలోని పౌరులందరికీ ఆధార్‌ కార్డు ఎంత ముఖ్యమో పాన్‌ కార్డు కూడా అంతే అవసరం. ఆధార్‌ కార్డు మనకు దేశ పౌరుడిగా గుర్తింపునిస్తుంది. పాన్‌ కార్డు మన ఆర్థిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఆర్థిక కార్యకలాపాలన్నీ చట్టానికి లోబడి జరిగేలా పర్యవేక్షిస్తుంది. కాబట్టి దేశంలోని ప్రతి ఒక్కరికీ పాన్‌ కార్డు అనేది ముఖ్యమైన పత్రం అని చెప్పవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులుంటే ఏమి జరుగుతుంది. అలా కలిగి ఉండడం చట్ట విరుద్దమా, వారికి ప్రభుత్వం ఎంత జరిమానా విధిస్తుందో తెలుసుకుందాం.

పాన్‌ కార్డు అంటే..

పర్మినెంట్‌ అక్కౌంట్‌ నంబర్‌ (పీఏఎన్‌) కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఆ శాఖ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక్క పాన్‌ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉండడం చట్ట విరుద్ధం. వ్యక్తులు, వ్యాపారాలు, ఇతర సంస్థలకు పాన్‌ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. దీనిలో ప్రత్యేకమైన పది అంకెలు ఉంటాయి. ఇది ఆ వ్యక్తికి ఆర్థిక లావాదేవీల కోసం అందించే గుర్తింపు పత్రం. బ్యాంక్ ఖాతాలను తెరవడానికి, రుణాలకు దరఖాస్తు చేసుకోవడానికి, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలోనూ, వివిధ పెట్టుబడులు పెట్టడానికి పాన్‌ కార్డు చాలా అవసరం. సూటిగా చెప్పాలంటే మీరు చేసే ప్రతి ఆర్థిక కార్యకలాపాలనికి పాన్‌ కార్డు ఉండాల్సిందే.

తప్పనిసరిగా అవసరం..

పాన్ కార్డులో వ్యక్తి పేరు, అతడి ఫొటో, పుట్టిన తేదీ, పాన్‌ నంబర్‌ ఉంటుంది. ఆ నంబర్‌ అనేది ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా కేటాయిస్తారు. ఆర్థిక లావాదేవీలకు రిఫరెన్స్ నంబర్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించే వారందరికీ చాలా అవసరం. అలాగే రియల్‌ ఎస్టేట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ లో పెట్టుబడి పెట్టేటప్పుడు తప్పనిసరిగా అవసరమవుతుంది.

రెండు కార్డులుంటే..

  • పాన్‌ కార్డుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కచ్చితమైన నియమాలను నిర్దేశించింది. వాటి ప్రకారం.. దేశంలో ఒక వ్యక్తి ఒక్క పాన్‌ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. అంతకు మించి ఉండడం నేరం. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్క కార్డు మాత్రమే జారీ చేస్తారు. దాన్నివేరొకరికి బదిలీ చేయరు.
  • ఒకటి కంటే ఎక్కువ కార్డులున్న వ్యక్తికి జరిమానా విధిస్తారు. అలా ఉండడం ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. అలాగే ఆదాయపు పన్ను రికార్డులను కూడా గందరగోళానికి గురి చేస్తుంది. వ్యక్తికి సంబంధించి పన్ను చెల్లింపులు, ఫైలింగ్‌లను ట్రాక్ చేయడానికి ఆటంకం కలిగిస్తుంది.
  • ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులున్నట్టు నిర్ధారణ అ‍యితే ఆ వ్యక్తికి రూ. పదివేలు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 272బీ కింద ఈ చర్యలను తీసుకుంటారు.
  • ప్రతి ఒక్కరూ కేవలం ఒక్క పాన్‌ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. ఒక వేళ అనుకోకుండా, ఇతరత్రా పొందిన అదనపు పాన్ కార్డులను సరెండర్ చేసేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..