AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: 2000 రూపాయల నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన

మీ వద్ద రూ.2000 నోట్ల ఉన్నాయా..? వెంటనే మార్చుకోండి. ఎందుకంటే సమయం ముగిసిపోతుంది. వాడుకలో ఉన్న 2 వేల రూపాయల నోట్లను ఉపసహరించుకునేందుకు నోట్లను వెనక్కి తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నోట్లు వెనక్కి రావడం ప్రారంభమైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పాలసీ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ .

RBI: 2000 రూపాయల నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన
Rbi
Subhash Goud
|

Updated on: Oct 06, 2023 | 2:16 PM

Share

మీ వద్ద రూ.2000 నోట్ల ఉన్నాయా..? వెంటనే మార్చుకోండి. ఎందుకంటే సమయం ముగిసిపోతుంది. వాడుకలో ఉన్న 2 వేల రూపాయల నోట్లను ఉపసహరించుకునేందుకు నోట్లను వెనక్కి తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నోట్లు వెనక్కి రావడం ప్రారంభమైంది.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పాలసీ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ రూ.2000 నోట్లకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించారు. బ్యాంకుల్లో నోట్ల డిపాజిట్, మార్పిడి గడువు మరికొద్ది గంటల్లో ముగియనున్న తరుణంలో ఈ సమాచారం అందింది. రూ.2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఉంది. అంతకు ముందు ఈ గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. తర్వాత దాన్ని అక్టోబర్ 7కి పెంచారు. మే 19న రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించగా, మే 23 నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. రూ.2000 నోటుకు సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ మరిన్ని వివరాలు అందించారు.

2000 నోటుకు సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక సమాచారం ఇచ్చారు. మే నుంచి తిరిగి వచ్చిన రూ.3.43 లక్షల కోట్ల రూ.2000 నోట్లలో 87 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో వచ్చినవేనని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా రూ.12 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మార్కెట్‌లో స్తంభించిపోయాయని, మళ్లీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదన్నారు. బ్యాంకులు సైతం ఈ నోట్ల కోసం ఎదురుచూస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో అక్టోబర్ 7 తర్వాత ఈ డబ్బు ఏమవుతుంది అనేది అతిపెద్ద ప్రశ్న. ఈ డబ్బు వృథా అవుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి.

గడువు తర్వాత ఏం జరుగుతుంది?

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 7, 2023 తర్వాత, 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మాత్రమే రూ.2000 బ్యాంక్ నోట్ల మార్పిడికి అనుమతి ఉంటుంది. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.20,000 నోట్ల నగదు డిపాజిట్ పరిమితి ఉంటుంది. ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో ఏదైనా, వ్యక్తులు లేదా సంస్థలు తమ భారతీయ బ్యాంకు ఖాతాల్లోకి ఎంత మొత్తమైనా జమ చేయడానికి రూ. 2000 బ్యాంకు నోట్లను జారీ చేయవచ్చు. పోస్టల్ శాఖ ద్వారా ఈ నోట్లను ఆర్బీఐకి పంపే సదుపాయం కూడా ఉంది. అదే సమయంలో కోర్టులు, చట్టపరమైన అమలు చేసే సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా ఏదైనా ఇతర పబ్లిక్ అథారిటీ విచారణ లేదా అమలులో, అవసరమైనప్పుడు, ఎటువంటి అనుమతి లేకుండా 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో దేనిలోనైనా రూ. 2000 బ్యాంకు నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి