ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌ సూట్..! 150 క్యారెట్ల డైమండ్స్‌తో తయారైన లెహంగా..ఇక ధర తెలిస్తే కళ్లు బైర్లే..!

ఇకపోతే, ఇప్పటి వరకు ఇషా అంబానీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లెహంగా ధరించిన రికార్డును కలిగి ఉన్నారు.. అద్భుతమైన బంగారు, ఎరుపు రంగులో ఉన్న లెహంగ ధర 90 కోట్లు. లెహంగా ప్రస్తుతం నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పుడు తయారు చేసిన ఈ రూ. 99.85 కోట్లు విలువైన లెహంగాను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరీ.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌ సూట్..! 150 క్యారెట్ల డైమండ్స్‌తో తయారైన లెహంగా..ఇక ధర తెలిస్తే కళ్లు బైర్లే..!
Diamond Wedding Dress
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 06, 2023 | 2:09 PM

బిలియనీర్ ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యుల పెళ్లిళ్లు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. అలంకారం, భోజనం, డెకరేషన్‌, మండపం అన్నీ అత్యంత వైభవంగా ఉంటాయి. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి డ్రెస్‌ కోసం రూ.90 కోట్లు వెచ్చించినట్టుగా వార్తలు వచ్చాయి. పెళ్లి సందర్భంగా ఆమె ధరించిన లెహంగా ప్రపంచంలోనే ఖరీదైనదిగా తెలిసింది. అంతేకాదు..ఇషా అంబానీ పెళ్లి ఖర్చు 700 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు దానికంటే మించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ లెహంగా కూడా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.! కానీ, ఇషా అంబానీ గోల్డెన్ లెహంగా కంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్ కూడా ఉంది. ఈ లెహంగాలో వజ్రాలను పొదిగించి తయారు చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, బ్రైడల్ డిజైనర్ రెనీ, ప్రఖ్యాత జ్యువెలర్ మార్టిన్ కాట్జ్ రూపొందించిన డైమండ్ వెడ్డింగ్ డ్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ దుస్తులు. ఇది అత్యంత ఆకర్షణీయమైన వివాహ దుస్తులలో ఒకటి.

డైమండ్ వెడ్డింగ్ డ్రెస్‌ను 2006లో మార్టిన్, రెనీ డిజైన్ చేశారు. గౌను ఐవరీ రంగులో ఉంటుంది. దీన్ని అత్యంత నాణ్యమైన విలాసవంతమైన పట్టుతో తయారు చేశారు. ఈ వెడ్డింగ్‌ సూట్‌లో అత్యంత విశిష్టమైన అంశం ఏమిటంటే, దానిలో 150 క్యారెట్ల వజ్రాలను సమకూర్చి తయారు చేశారు. ఈ వివాహ దుస్తులను ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌ సూట్‌గా పిలుస్తారు. పెళ్లి దుస్తుల ధర ప్రస్తుతం USD 12 మిలియన్లు. ఇది భారతీయ కరెన్సీలో రూ. 99.85 కోట్లు. ఇది ఇషా అంబానీ వివాహ లెహంగా కంటే ఖరీదైనది. కాలిఫోర్నియాలోని విలాసవంతమైన రిట్జ్ కార్ల్టన్ హోటల్‌లో వెడ్డింగ్ గౌన్‌ను డిజైనర్ ద్వయం ఆవిష్కరించింది.

ఇకపోతే, ఇప్పటి వరకు ఇషా అంబానీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లెహంగా ధరించిన రికార్డును కలిగి ఉన్నారు.. అద్భుతమైన బంగారు, ఎరుపు రంగులో ఉన్న లెహంగ ధర 90 కోట్లు. లెహంగా ప్రస్తుతం నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పుడు తయారు చేసిన ఈ రూ. 99.85 కోట్లు విలువైన లెహంగాను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!