AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజంగానే మెరాకిల్‌.. ఒకే రోజు ఆరుసార్లు గుండెపోటుకు గురైన విద్యార్థి.. వైద్యుల కృషితో..

ఈ క్రమంలోనే అతడు గత జులై 27న కాలేజీలో ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలాడు. అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు వెంటనే స్పంది అతుల్‌కు సీపీఆర్‌ ఇచ్చాడు. అనంతరం తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది సాయంతో హుటాహుటినా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన అతుల్‌రావును పరీక్షించిన వైద్యులు.. అతడి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టిందని, దాని కారణంగా గుండెకు రక్తం సరఫరా ఆగిపోయిందని చెప్పారు.

నిజంగానే మెరాకిల్‌.. ఒకే రోజు ఆరుసార్లు గుండెపోటుకు గురైన విద్యార్థి.. వైద్యుల కృషితో..
Cardiac Arrest
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2023 | 1:22 PM

Share

లండన్‌లో చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఓ విద్యార్థి ఒక్కరోజులో ఆరుసార్లు గుండెపోటులతో బయటపడ్డాడు. చాలా సందర్భాల్లో చాలా మంది చావు అంచుల దాకా వెళ్లి బతికి వస్తుంటారు.. ఇంతకు ముందు తెలిసిన వార్తలో ఒక మూడు రోజుల పసికందు అంత్యక్రియలకు కొద్ది క్షణా ముందు బతికి ఆ తల్లిదండ్రులకు ఆనందనిచ్చింది. దాదాపుగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి ఒకే రోజు 6 సార్లు గుండెపోటు వచ్చింది. అయినా అతడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. బ్రిటన్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన అతుల్‌రావు అనే యువకుడు బ్రిటన్‌లోని లండన్‌లో ఓ మెడికల్‌ కాలేజీలో ప్రీ మెడికల్‌ డిగ్రీ లాస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు గత జులై 27న కాలేజీలో ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలాడు. అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు వెంటనే స్పంది అతుల్‌కు సీపీఆర్‌ ఇచ్చాడు. అనంతరం తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది సాయంతో హుటాహుటినా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చేరిన అతుల్‌రావును పరీక్షించిన వైద్యులు.. అతడి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టిందని, దాని కారణంగా గుండెకు రక్తం సరఫరా ఆగిపోయిందని చెప్పారు. గుండెకు రక్తం సరఫరా ఆగిపోవటం కారణంగా అతడికి గుండె కొట్టుకోవటం మానేసిందని వైద్యులు తేల్చారు. దీని వల్ల కొన్ని గంటల వ్యవధిలోనే అతడికి ఆరు సార్లు గుండెపోటు వచ్చినట్లు డాక్టర్స్‌ చెప్పారు. వైద్య బృందం ఎంతో కష్టపడి అతుల్‌ ప్రాణాలను నిలిపారు. దాదాపు రెండు వారాల తర్వాత అతుల్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు.

కొడుకు ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవటంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడిన ఇంపీరియల్‌ కాలేజ్‌ హెల్త్‌కేర్‌ ఆస్పత్రిని సందర్శించారు అతుల్‌ తల్లిదండ్రులు. అక్కడి డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా అతుల్‌ రావు మాట్లాడుతూ.. ఈ సంఘటన జరగడానికి ముందు తాను వైద్య రంగాన్ని ఎంచుకోవాలా లేక వ్యాపార రంగాన్ని ఎంచుకోవాలా అని అయోమయంలో ఉండేవాడినని, దాదాపు తాను బిజినెస్ వైపు వెళ్లిపోయినట్టుగా చెప్పాడు. కానీ ఇప్పుడు తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డ తర్వాత తన నిర్ణయం మార్చుకున్నానని చెప్పాడు. తనకు లభించిన రెండవ అవకాశాన్ని ఇతరులకు సహాయం చేయడానికి వెచ్చించాలనుకుంటున్నాను అని అతుల్ రావు అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి