Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు రోజుల పసికందు.. చనిపోయిందని చెప్పిన వైద్యులు.. అంత్యక్రియలకు కొద్ది నిమిషాల ముందు జరిగిన అద్భుతం.. !

చిన్నారి కుటుంబీకులు ఆస్పత్రిపై, వైద్యుడిపై ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన బిల్లు, డాక్టర్ సమ్మరీ సహా అన్నీ పోలీసులకు అప్పగించారు. దీంతో ఇప్పుడు ఆసుపత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.  మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన చిన్నారి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బతకాలని సోషల్ మీడియా వినియోగదారులు, ప్రజలు కోరుకుంటున్నారు. 

మూడు రోజుల పసికందు.. చనిపోయిందని చెప్పిన వైద్యులు.. అంత్యక్రియలకు కొద్ది నిమిషాల ముందు జరిగిన అద్భుతం.. !
Baby Boy
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 06, 2023 | 11:44 AM

ఇది వైద్యుల నిర్లక్ష్యమా లేక అద్భుతమా..? అస్సాం రాజధాని గౌహతిలోని ఓ ఆసుపత్రిలో పాప పుట్టింది. రెండు రోజుల పాటు చిన్నారికి ఐసీయూలో చికిత్స అందించారు. కానీ, చలనం లేదు. దీంతో వైద్యులు చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోదనలు, వేదన, కన్నీరు మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. దహన సంస్కారాలు చివరి దశకు చేరుకుంటుండగా ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.. కుటుంబీకులు వెంటనే చిన్నారిని ఎత్తుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఐసీయూ యూనిట్‌లో చికిత్స పొందుతోంది.

గర్భిణి పురిటి నొప్పితో గౌహతిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఒకవైపు రక్తస్రావంతో పాటు ఇతర సమస్యలు ఉన్నా ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం అందలేదు. దీంతో గర్భిణిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్టోబరు 3న రాత్రి 10 గంటలకు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బరువు 500 గ్రాములు మాత్రమే ఉంది. చిన్నపాటి గుండె దడ తప్ప పసికందులో ఎలాంటి చలనం లేదు. పుట్టిన బిడ్డ ఏడవలేదు. పరీక్షించిన వైద్యులు చిన్నారి తండ్రి రతన్ దాస్‌కు విషయం చెప్పారు. కదలిక లేకపోవడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స చేయించాలని చెప్పారు. బుధవారం తెల్లవారుజామున చిన్నారిలో కదలిక లేకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పాపను వైద్యుడు రతన్ దాస్, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంతలో ఆసుపత్రి సిబ్బంది చిన్నారి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. చిన్నారి తల్లికి చికిత్స కొనసాగించారు. నొప్పులు, వేదనతో చిన్నారి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం అంత్యక్రియలు ప్రారంభించారు. చివరి దశ ప్రక్రియ జరగాల్సి ఉండగానే పాప ఏడుపు శబ్దం వినిపించిందని చెప్పారు.. పిల్లాడి కాళ్ళలో కదలిక వచ్చింది. దాంతో కుటుంబీకులు వెంటనే చిన్నారిని దహన సంస్కారాల నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిసింది.

ఇవి కూడా చదవండి

చిన్నారి కుటుంబీకులు ఆస్పత్రిపై, వైద్యుడిపై ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన బిల్లు, డాక్టర్ సమ్మరీ సహా అన్నీ పోలీసులకు అప్పగించారు. దీంతో ఇప్పుడు ఆసుపత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన చిన్నారి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బతకాలని సోషల్ మీడియా వినియోగదారులు, ప్రజలు కోరుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..