AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యోతిష్యుడి ఇంట్లో లక్షల రూపాయలను దోచుకున్న దొంగలు.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రీల్‌ ఇట్టే పట్టించింది..ఏం జరిగిందంటే..

జ్యోతిష్యుడు కూడా చాలా మంది సహాయం తీసుకుని ఆధారాల కోసం ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నెలలు గడుస్తున్నా దొంగల జాడ లేదు. ఇక్కడ దొంగలు ఎలాంటి చిన్న క్లూ కూడా దొరక్కుండా పక్కాగా చోరీకి పాల్పడ్డారు. చివరకు ఆ దోంగలు జ్యోతిష్యుడి ఇంట్లో ఎత్తుకెళ్లిన నగదు నోట్లను ఉపయోగించి రీల్స్‌ తయారు చేశారు. ఆ రీల్స్‌ను సోషల్‌ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదే వారిని కటకటాల పాలు చేసింది.

జ్యోతిష్యుడి ఇంట్లో లక్షల రూపాయలను దోచుకున్న దొంగలు.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రీల్‌ ఇట్టే పట్టించింది..ఏం జరిగిందంటే..
Stolen Cash
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2023 | 1:39 PM

Share

రెచ్చిపోయిన దొంగలు పెద్ద ప్లాన్ వేసి జ్యోతిష్యుడి ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. అతడి ఇంట్లో దొరికిన నగదు, నగలను దోచుకున్నారు. ఇంట్లోని నగదును దొంగిలించి రాత్రికి రాత్రే పరారయ్యారు. జ్యోతిష్యుడు సంపాదించిన సొమ్ము అంతా ఇలా ఒక్క రాత్రిలోనే దొంగల పాలైంది. దీంతో షాక్‌కు గురైన జ్యోతిష్యుడు తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ ప్రారంభించినా ఎలాంటి క్లూ లభించలేదు. జ్యోతిష్యుడు కూడా చాలా మంది సహాయం తీసుకుని ఆధారాల కోసం ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నెలలు గడుస్తున్నా దొంగల జాడ లేదు. ఇక్కడ దొంగలు ఎలాంటి చిన్న క్లూ కూడా దొరక్కుండా పక్కాగా చోరీకి పాల్పడ్డారు. చివరకు ఆ దోంగలు జ్యోతిష్యుడి ఇంట్లో ఎత్తుకెళ్లిన నగదు నోట్లను ఉపయోగించి రీల్స్‌ తయారు చేశారు. ఆ రీల్స్‌ను సోషల్‌ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదే వారిని కటకటాల పాలు చేసింది.

జ్యోతిష్యుడి ఇంట్లో నగదు లూటీ చేసిన దొంగలు..నెలలు గడిచే సరికి తమను ఎవరూ పట్టుకోలేరనే ధీమాతో తప్పిదం చేశారు.. జ్యోతిష్యుడి ఇంట్లో దొంగతనం చేసిన నోట్ల కట్టలతో వారు రీల్స్‌ తయారు చేశారు. దొంగిలించిన నగదును మంచంపై పరిచి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేశారు. ఒక వ్యక్తి తన చేతిలో రూ.500 నోట్లు పట్టుకున్నట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే, పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

కాన్పూర్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు తరుణ్ శర్మ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని నగదు, నగలు మొత్తం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో షాక్‌కు గురైన తరుణ్ శర్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. పరారీలో ఉన్న వారిని కూడా పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..