AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్రామంలో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో కుటుంబంపై దారుణం.. గ్రామం వదిలి వెళ్లిన వారంతా..!!

Kamareddy: మంత్రాలు చేయడం వల్ల గ్రామంలో పలువురు వ్యాధుల బారినపడుతున్నారని, వరుసగా చనిపోతున్నారంటూ తమపై  ఆరోపణలు చేశారంటూ సాయిలు, నాగవ్వ దంపతులు వాపోయారు.  మనస్థాపం చెంది గ్రామాన్ని విడిచి వెళ్లినట్లుగా దంపతులు తెలిపారు. గత 20 రోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు,అదే విధంగా గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మంత్రాలు చేస్తున్నారని నాగావ్వపై కత్తితో,రాళ్లతో దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ముక్కు, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

Telangana: గ్రామంలో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో కుటుంబంపై దారుణం.. గ్రామం వదిలి వెళ్లిన వారంతా..!!
Black Magic
Prabhakar M
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 06, 2023 | 10:23 AM

Share

కామారెడ్డి జిల్లా, అక్టోబర్‌06; మంత్రాలు, చేతబడులు వంటి మూడనమ్మకాల పట్ల ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినప్పటికీ ఎక్కడో ఒక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రాలు చేస్తున్నారంటూ అమాయకులను చిత్రహింసలకు గురి చేయటం, కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో మంత్రాల పేరిట దారుణ హత్యలు కూడా జరిగాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ కుటుంబాన్ని గ్రామం నుంచి వెళ్లగొట్టారు స్థానికులు. మంత్రాలు చేస్తున్నారనే నెపం భరించలేక ఓ కుటుంబం గ్రామాన్ని వదిలి వెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…

బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వొద్దుల సాయిలు- నాగవ్వ అనే దంపతులు మంత్రాలు చేస్తున్నారని కులానికి,గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నెపం వేయడంతో అవమానం భరించలేక గ్రామాన్ని విడిచి వెళ్లిపోయినట్లు సాయిలు-సంగవ్వతెలిపారు.  కులంలో చేపల విషయంలో డబ్బులు కట్టే విషయంలో కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు మంత్రాలు చేయడం వల్ల గ్రామంలో పలువురు వ్యాధుల బారినపడుతున్నారని, వరుసగా చనిపోతున్నారంటూ తమపై  ఆరోపణలు చేశారంటూ సాయిలు, నాగవ్వ దంపతులు వాపోయారు.  మనస్థాపం చెంది గ్రామాన్ని విడిచి వెళ్లినట్లుగా దంపతులు తెలిపారు. గత 20 రోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు,అదే విధంగా గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మంత్రాలు చేస్తున్నారని నాగావ్వపై కత్తితో,రాళ్లతో దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ముక్కు, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

ఇదే విషయంపై దంపతులు గ్రామ సర్పంచ్ వీడీసీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా మీరు మంత్రాలు చేస్తున్నారని గ్రామ సర్పంచ్,వీడీసీ సభ్యులు గ్రామం వదిలి వెళ్లాలని హుకుం జారీ చేసినట్లు దంపతులు తెలిపారు. గ్రామంలో వారికి జరిగిన అవమానం  భరించలేక గ్రామాన్ని విడిచి సంగవ్వ తల్లిగారు ఊరైన మేడిపల్లి గ్రామంలో గత 20 రోజులుగా తలదాచుకుంటున్నామని గ్రామానికి వాపోయారు.  తమ ఊరికి వెళితే తమను చంపేస్తారని ప్రాణభయం ఉన్నట్లు తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..