Telangana: దారుణం..కోతుల‌కు విషం పెట్టి చంపిన మ‌నుషులు.. నిందితులను పట్టుకోవాలంటూ స్థానికుల డిమాండ్..

Peddapalli District: గ్రానైట్ వ్యాపారం కారణంగా కొండలు అంతరించి పోతున్నాయి. దీంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులకు కోతులకు విషమిచ్చి చంపేశారు.  చనిపోయిన కోతులను చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్ కు సమాచారం అందించారు.  సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు

Telangana: దారుణం..కోతుల‌కు విషం పెట్టి చంపిన మ‌నుషులు.. నిందితులను పట్టుకోవాలంటూ స్థానికుల డిమాండ్..
Monkeys Killed
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 06, 2023 | 9:39 AM

పాపం.. మూగ జీవలను చంపేశారు… దేవుడికి ప్రతి రూపంగా భావించే వానరాలకు విషం పెట్టి దారుణంగా హత్య చేశారు.. 35కు పైగా కోతులు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. ఈ సంఘటన పై విచారణ చేపట్టారు. ఈ దారుణ సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బ పల్లి గ్రామ సమీపంలోని స్మశాన వాటిక దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు కోతులకు విషం పెట్టి చంపేశారు. మృతి చెందిన కోతులను తీసుకొచ్చి స్మశాన వాటిక సమీపంలో పడ వేశారు.  35 పైగా కోతులు చనిపోయి ఉన్నాయి..

అయితే, పథకం ప్రకారమే.. ఈ కోతులను చంపేశారని తెలిసింది.. ఇటీవల కోతులు గ్రామాల్లోకి విపరీతంగా వస్తున్నాయి.. గ్రానైట్ వ్యాపారం కారణంగా కొండలు అంతరించి పోతున్నాయి. దీంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులకు కోతులకు విషమిచ్చి చంపేశారు.  చనిపోయిన కోతులను చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్ కు సమాచారం అందించారు.  సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి వాటిని పశు వైద్యాధికారి రఘుపతి రెడ్డి ఆయన టీం తో పంచనామా చేయించారు.  విషం పెట్టి చంపిన వ్యక్తులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఏది ఏమైనా మూగజీవాలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలి తప్ప , విషం పెట్టి చంపడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులే  ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడి  ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.. ఈ కోతుల అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..