AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లాస్‌గా విమానంలో వస్తారు.. ధనవంతులు ప్రయాణించే రైళ్లలో ప్రయాణిస్తుంటారు.. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా..?

నిందితులు జల్సాలు, విలాసవంతమైన జీవితానికి అలవాట్టుపడ్డారని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి విమానంలో ప్రయాణించి పలు రైళ్లలో దొంగలకు పాల్పడుతున్నారని తేల్చారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిందితులు ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చోరీకి గురైన ఆభరణాలతో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఎయిర్‌పోర్టులో వీరిద్దరూ ఆర్పీఎఫ్‌కి పట్టుబడ్డారు.

క్లాస్‌గా విమానంలో వస్తారు.. ధనవంతులు ప్రయాణించే రైళ్లలో ప్రయాణిస్తుంటారు.. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా..?
Gold Theft Cases
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2023 | 8:45 AM

Share

విమానంలో వచ్చి రైళ్లలో బంగారాన్ని అపహరించిన యూపీ దొంగలు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. మంగళూరులో వారాంతపు రైళ్లలో చోరీకి విమానంలో వచ్చి ప్రయాణికుల బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు హైటెక్ దొంగలను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఉత్తరప్రదేశ్ నుంచి విమానంలో వచ్చి రాత్రి వేళల్లో ప్రయాణించే రైళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలు చేసేవారు. రైలులో బంగారు ఆభరణాలు ధరించిన వృద్ధులు, మహిళలు కనిపిస్తే చాలు. ఎలాగైన సరే వాటిని కాజేసేవారు. రైలు వేగం తగ్గిన మరుక్షణంలోనే..ప్రయాణికుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని కోచ్‌లపై నుంచి దూకి పరారయ్యేవారు. ఎట్టకేలకు కేటుగాళ్లను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

అరెస్టయిన వారిని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని ధోరుపురాకు చెందిన అభయ్‌రాజ్ సింగ్ (26), రాజ్‌పూర్‌కు చెందిన హరిశంకర్ గిరి (25)గా గుర్తించారు. నిందితులు ఉత్తరప్రదేశ్ నుంచి విమానంలో వచ్చి రాత్రి వేళల్లో నడిచే రైళ్లను ఎంచుకుని దొంగతనాలు చేసేవారు. రైలులో బంగారు ఆభరణాలు ధరించిన వృద్ధులు, మహిళలు కనిపించారు. రైలు వేగం తగ్గడంతో వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని కోచ్‌లపై నుంచి దూకి పరారయ్యారు. సెప్టెంబరు 28న మంగళూరు-సూరత్‌కల్‌ మధ్య వెళ్తున్న రైలులో ప్రయాణికుడి బంగారు ఆభరణాలు చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకుల తీరుపై ఆర్పీఎఫ్ పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది..నిందితులు దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.

నిందితులు.. తిరువనంతపురం-గోవా రూట్లలో నడిచే రైళ్లలో సాధారణ ప్రయాణికులలానే ఎక్కుతారు. ఎక్కువగా రాత్రివేళ్లలోనే ప్రయాణిస్తూ తమ కానిచ్చేస్తుంటారు. సెప్టెంబరు 2న కాయంకుళం నుంచి నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళా ప్యాసింజర్ కాలిపట్టీలను దొంగిలించగా, మరుసటి రోజు ఓఖా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న మరో మహిళ నగలను ఎత్తుకెళ్లారు. వరుస సంఘటనలతో అప్రమత్తమైన RPF అధికారులు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేటుగాళ్ల ఆటకట్టించారు. అనంతరం నిందితులను మంగళూరు రైల్వే పోలీసుల కస్టడీకి అప్పగించారు. రైల్వేలోని పాలక్కాడ్, తిరువనంతపురం, కొంకణ్ రైల్వే జోన్‌లలో ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలతో పాటు మొత్తం 125 గ్రాముల బంగారాన్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

నిందితులు జల్సాలు, విలాసవంతమైన జీవితానికి అలవాట్టుపడ్డారని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి విమానంలో ప్రయాణించి పలు రైళ్లలో దొంగలకు పాల్పడుతున్నారని తేల్చారు. వీరు గోవా-తిరువనంతపురం మార్గంలో రైలులో ప్రయాణిస్తూ.. రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తుంటారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిందితులు ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చోరీకి గురైన ఆభరణాలతో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఎయిర్‌పోర్టులో వీరిద్దరూ ఆర్పీఎఫ్‌కి పట్టుబడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..