AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 27 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌కి వేదికైన భాగ్య నగరం.. పాకిస్థాన్‌ మ్యాచ్‌ నేపథ్యంలో పటిష్ట చర్యలు

ఇందులో తొలి మ్యాచ్‌ నేడు (శుక్రవారం) జరగనుంది. వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతోన్న రెండో మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా జరుగుతుంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌ జట్లు ఉప్పల్‌ స్టేడియంలో ఢీకొట్టనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. మ్యాచ్‌ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశార. స్టేడియంలో కొత్తగా పెయింట్‌తో పాటు, లైట్‌ సీట్లు అందుబాటులోకి....

Hyderabad: 27 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌కి వేదికైన భాగ్య నగరం.. పాకిస్థాన్‌ మ్యాచ్‌ నేపథ్యంలో పటిష్ట చర్యలు
World Cup 2023
Narender Vaitla
|

Updated on: Oct 06, 2023 | 10:06 AM

Share

హైదరాబాద్‌ నగరం వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌కు వేదికైంది. అజారుద్దీన్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరగ్గా మళ్లీ ఇప్పుడు 27 ఏల్ల తర్వాత వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికైంది. అయితే ఈసారి భాగ్యనగరంలో మూడు ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు జరుగుతుండడం విశేషం.

ఇందులో తొలి మ్యాచ్‌ నేడు (శుక్రవారం) జరగనుంది. వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతోన్న రెండో మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా జరుగుతుంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌ జట్లు ఉప్పల్‌ స్టేడియంలో ఢీకొట్టనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. మ్యాచ్‌ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశార. స్టేడియంలో కొత్తగా పెయింట్‌తో పాటు, లైట్‌ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 10వేల కొత్త సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన స్టేడియం నిర్వాహకులు మరో మ్యాచ్‌ సమయానికి స్టేడియంలోని అన్ని సీట్లను మార్చేస్తామని తెలిపారు.

మ్యాచ్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మొత్తం 1500 పోలీసులు విధుల్లో ఉండనున్నారు. స్టేడియంలో మ్యాచ్‌లు సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్ చౌహాన్‌ తెలిపారు. స్టేడియంలోకి గేట్‌ నెంబర్‌ 1 నుంచి మాత్రమే ఆటగాళ్లను అనుమతిస్తారని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. స్టేడియం చుట్టూ 360 సీసీటీవీలను ఏర్పాటు చేశారు. ఎలాంటి కుట్రలకు తావులేకుండా బాంబు స్క్వాడ్‌లను సైతం రంగంలోకి దింపారు.

ఇక మ్యాచ్‌ వీక్షించేందుకు హాజరయ్యే ప్రేక్షకులు బ్యానర్లు, వాటర్‌ బాటిళ్లు, కమెరాలు, సిగరెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మ్యాచ్‌ బాక్స్‌, లైటర్స్‌, చాకులు, బైనాక్యులర్‌, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్స్‌, పెర్ఫ్యూమ్‌ బాటిల్స్‌ ఇలా ఎలాంటి వస్తువులను అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఇందుకోసం స్టేడియంలోని అన్ని ఎంట్రీ పాయింట్స్‌ దగ్గర చెకింగ్‌ కోసం చెక్‌ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో అదనపు బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..