PAK vs NED: నేడే ఉప్పల్ వేదికగా పాక్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఎలా ఉండొచ్చంటే?
ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. తద్వారా గత ప్రపంచకప్ ఫైనల్‌లో ఎదురైన పరాభావానికి బదులు తీర్చుకుంది. ఇప్పుడు టోర్నీలో రెండో మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. శుక్రవారం (అక్టోబర్ 6) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది

ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. తద్వారా గత ప్రపంచకప్ ఫైనల్‌లో ఎదురైన పరాభావానికి బదులు తీర్చుకుంది. ఇప్పుడు టోర్నీలో రెండో మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. శుక్రవారం (అక్టోబర్ 6) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఇదిలా ఉంటే సుమారు 12 ఏళ్ల తర్వాత నెదర్లాండ్స్ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో తమను తాము నిరూపించుకున్న నెదర్లాండ్స్ ప్రధాన టోర్నీలోనూ సత్తాచాటాలనుకుంటోంది. ఇక టోర్నీ ముందు ఫేవరెట్‌గా నిలిచిన పాక్ రెండు వార్మప్ మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం జట్టును ఆందోళన పరుస్తోంది. దీనికి తోడు ఆసియా కప్ వైఫల్యం వారిని వెంటాడుతోంది. నసీమ్ షా గాయం కారణంగా 2023 వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దీంతో పాక్ శిబిరంలో ఆందోళన నెలకొంది. పాకిస్థాన్‌కు బాబర్ ఆజం నాయకత్వం వహించనున్నాడు. స్కాట్ ఎడ్వర్డ్స్ నెదర్లాండ్స్‌కు సారథ్య బాధ్యతలు చూసుకుంటున్నాడు. కాగా ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో.రెండు జట్లూ విజయంతో ఆరంభించాలనుకుంటున్నాయి.
పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్ ప్రసారం కానుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.
ప్రపంచ కప్ కోసం నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు
View this post on Instagram
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, విక్రమ్ సింగ్, తేజా నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, షరీజ్ జుల్ఫికర్, అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు
View this post on Instagram
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టుబాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








