IND vs BAN: ఫైనల్ చేరిన భారత్.. తెలుగబ్బాయ్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఆసియా క్రీడల్లో పతకం పక్కా..
Team India enters Asian Games Mens T20I 2023 Final: ఆసియా క్రీడల పురుషుల మొదటి T20 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో పతకాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే రెండో సెమీ ఫైనల్లో గెలిచిన జట్టుతో ఫైనల్ ఆడనుంది. కాగా, నేడు రెండో సెమీస్‌లో పాకిస్తాన్ జట్టు, ఆఫ్టాన్‌తో తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం లేదా రజత పతకం ఖాయం చేసుకుంది.

India vs Bangladesh, Semi Final 1: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఈరోజు పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్‌లో జరిగిన పురుషుల తొలి టీ20 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సైఫ్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం లేదా రజత పతకం ఖాయమైంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ హసన్ 5 పరుగులు, కెప్టెన్ సైఫ్ హసన్ 1 పరుగు, జకీర్ హసన్ సున్నా సాధించారు. పర్వేజ్ హొస్సేన్ ఎమాన్ 23 పరుగులు చేశాడు. జాకర్ అలీ 14 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరారు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. భారత్ తరపున సాయి కిషోర్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు.
సులువైన లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా తొలి ఓవర్ లోనే విజయవంతమైన జైస్వాల్ వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన జైస్వాల్ ఈసారి సున్నాకే పెవిలియన్ చేరాడు. అయితే రెండో వికెట్‌కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో విజయాన్ని అందించారు. భారత్ 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి విజయం సాధించింది. తిలక్ కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 55 పరుగులు చేయగా, గైక్వాడ్ అజేయంగా 40 పరుగులు చేశాడు.
View this post on Instagram
నేటి మ్యాచ్‌లో టీమిండియాలో ఒక మార్పు చోటు చేసుకుంది. అవేష్ ఖాన్ స్థానంలో షాబాజ్ అహ్మద్ వచ్చాడు. దీని ద్వారా షాబాజ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 1 వికెట్ కూడా తీశాడు. ఓడిన బంగ్లాదేశ్ జట్టు సెమీ-2లో ఓడిన జట్టుతో కాంస్య పతకం కోసం పోరాడుతుంది.
జట్లు:
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, సైఫ్ హసన్(సి), అఫీఫ్ హొస్సేన్, షాహదత్ హొస్సేన్, జాకర్ అలీ(w), రకీబుల్ హసన్, హసన్ మురాద్, మృత్తుంజోయ్ చౌదరి, రిపాన్ మొండోల్
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్(సి), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ(w), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ..








