మెట్రోలో బాలీవుడ్‌ నటి హంగామా..! ప్రయాణికులతో వాగ్వాదం, దాడి.. వీడియో వైరల్‌..

పంకజ్ శర్మగా పిలువబడే అతను తరువాత బాబీ డార్లింగ్‌గా మారాడు. 1999లో బాబీ డార్లింగ్ అనిల్ కపూర్ నటించిన ప్రసిద్ధ చిత్రం తాల్‌లో డ్రెస్ డిజైనర్‌గా నటించారు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించారు. బాబీ డార్లింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బాబీ డార్లింగ్ భోపాల్‌కు చెందిన వ్యాపారవేత్త ను వివాహం చేసుకున్నాడు, కానీ తరువాత విడిపోయారు. అయితే, ప్రస్తుతం బాబీ డార్లింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మెట్రోలో రైల్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు..

మెట్రోలో బాలీవుడ్‌ నటి హంగామా..! ప్రయాణికులతో వాగ్వాదం, దాడి.. వీడియో వైరల్‌..
Bobby Darling
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 06, 2023 | 12:29 PM

బాబీ డార్లింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఢిల్లీ మెట్రోలో ఒక ప్రయాణికుడిని కొట్టడం, దుర్భాషలాడడం కనిపిస్తుంది. పరిస్థితి చేయి జారిపోతుందనే సూచనలు కనిపించడంతో, ఒక CISF సైనికుడు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశాడు. తాల్, చల్తే చల్తే, పేజ్ 3 సహా పలు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి బాబీ డార్లింగ్ బిగ్ బాస్ ఫస్ట్‌ ఎడిషన్‌లో కూడా కనిపించారు. ప్రస్తుతం బాబీ డార్లింగ్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ మెట్రోలో ఓ ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగడమే కాకుండా అతడితో గొడవకు దిగిన వీడియో ఇది. వీరిద్దరి మధ్య జరిగిన తీవ్రమైన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో మెట్రోలో భద్రతలో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాను జోక్యం చేసుకుని వారిద్దరినీ శాంతింపజేశారు. వైరల్ వీడియోలో, బాబీ డార్లింగ్ తెల్లటి బ్యాగ్‌ను పట్టుకుని ఉండగా, ఒక వ్యక్తి దానిని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణికుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఇంతలో, బాబీ డార్లింగ్ ఆ వ్యక్తిని దుర్భాషలాడుతూ, కొట్టడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియోను Xలో ట్విటర్ యూజర్ షేర్ చేశారు.

ఈ ఘటనపై బాబీ డార్లింగ్ ఇప్పటివరకు స్పందించలేదు. మీడియా కథనాల ప్రకారం, ఈ సంఘటన వారం క్రితం జరిగింది. ఈ వీడియోపై డీఎంఆర్సీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైళ్లలో ఇటువంటి చర్యలను సహించబోమని చెప్పారు. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికులు కూడా ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని కోరాఉ. అప్పుడే తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి

బాబీ డార్లింగ్ ఒక ట్రాన్స్ జెండర్ నటి. పంకజ్ శర్మగా పిలువబడే అతను తరువాత బాబీ డార్లింగ్‌గా మారాడు. 1999లో బాబీ డార్లింగ్ అనిల్ కపూర్ నటించిన ప్రసిద్ధ చిత్రం తాల్‌లో డ్రెస్ డిజైనర్‌గా నటించారు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించారు. బాబీ డార్లింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

బాబీ డార్లింగ్ 2016లో భోపాల్‌కు చెందిన వ్యాపారవేత్త రామ్నిక్ శర్మను వివాహం చేసుకున్నాడు, కానీ తరువాత విడిపోయారు. బాలీవుడ్ స్టార్ భర్త భోపాల్‌లో వ్యాపారవేత్త. బాబీ డార్లింగ్ అనేక టీవీ షోలలో కనిపించాడు. ఫేమ్ గురుగుల్, బిగ్ బాస్ షోలతో పాటు, ఆమె సచ్ కా సామ్నా, ఎమోషనల్ రేప్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్, ఆహద్‌లలో కనిపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!