AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshar Dham: ‘ఐక్యత, సంబంధాలను పురస్కరించుకుని..’ అక్షర్ ధామ్ నాలుగో రోజు వేడుకలు, స్థానిక మేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

అక్కడ దైవ మందిరాల నిర్మాణం 150 ఏళ్ల కిందటే మొదలైంది. అవన్నీ ఒక ఎత్తయితే.. బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ఒక్కటీ ఒక ఎత్తు. మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ఇప్పటికే ప్రతిష్టాపన ఉత్సవాలు సెప్టెంబర్ 30న వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే 183 ఎకరాల విస్తీర్ణంలో 255 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ క్షేత్రాన్ని ఇప్పటికే వేలాదిమంది దర్శించుకుంటున్నారు. పదివేలకు పైగా హిందూ దైవ ప్రతిమలు..

Subhash Goud
|

Updated on: Oct 06, 2023 | 5:59 PM

Share

ఆధ్యాత్మికత, ఆధునికత, స్వచ్ఛత కలగలసిన అద్భుత క్షేత్రం. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం BAPS స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌. అయితే ఇది నార్త్ అమెరికా న్యూజెర్సీ రాష్ట్రం, రాబిన్స్‌విల్లె పట్టణం ఉంది.ఈ అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలోని న్యూజెర్సీలో అక్టోబర్‌ 8వ తేదీన ప్రారంభం కానుంది. అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీ ఆధ్యాత్మిక పరంగా చాలా బలంగా ఉంది. వారి కార్యకలాపాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అక్కడ దైవ మందిరాల నిర్మాణం 150 ఏళ్ల కిందటే మొదలైంది. అవన్నీ ఒక ఎత్తయితే.. బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ఒక్కటీ ఒక ఎత్తు. మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ఇప్పటికే ప్రతిష్టాపన ఉత్సవాలు సెప్టెంబర్ 30న వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే 183 ఎకరాల విస్తీర్ణంలో 255 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ క్షేత్రాన్ని ఇప్పటికే వేలాదిమంది దర్శించుకుంటున్నారు. పదివేలకు పైగా హిందూ దైవ ప్రతిమలు కొలువుదీరాయి. చూడడానికి రెండు కళ్లూ చాలవన్నంత అద్భుతమైన కళాత్మక నిర్మాణం ఇది. కాగా, ప్రపంచంలోని 300 నదులు, భారతదేశంలోని నాలుగు పుణ్యనదుల జలాలతో రూపొందించిన అరుదైన సరస్సు బ్రహ్మ కుండ్ ఇక్కడ స్పెషాలిటీల్లో ఒకటి. 12 సంవత్సరాల పరిశ్రమ తర్వాత.. వంద సామాజిక వర్గాలకు చెందిన 12 వేల 500 మంది వాలంటీర్ల చేతుల మీదుగా రూపొందిన అద్భుతమైన నిర్మాణం ఇది. ఆధునిక యుగంలో సంపూర్ణంగా చేతితో మాత్రమే చెక్కబడిన హిందూ దేవాలయాలలో ఇది ప్రధానమైనది.

అయితే న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో అక్టోబర్ 5న బీఏపీఎస్‌ స్వామినారాయణ్ అక్షరధామ్ అమెరికాలోని వివిధ కమ్యూనిటీల మధ్య ఐక్యత, సంబంధాలను పురస్కరించుకుని ‘సెలబ్రేటింగ్ కమ్యూనిటీ’ అనే థీమ్‌ను జరుపుకొంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ మేయర్లు, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. అయితే పూజ్య చైతన్యమూర్తిదాస్ స్వామి, రాబిన్స్‌విల్లే వంటి కమ్యూనిటీల సహకార స్ఫూర్తిని రాబిన్స్‌ విల్లే మేయర్‌ డేవిడ్‌ వివరించారు. అమెరికా వ్యవస్థాపక సూత్రాలు, హిందూ ఐక్యత బోధనల మధ్య భాగస్వామ్య విలువలను ఆయన హైలైట్ చేశారు. తన దశాబ్దకాల అనుబంధాన్ని, సంఘం-నిర్మాణానికి సంస్థ నిబద్ధతను ఆయన వివరించారు. “నేను BAPSని సంప్రదించిన ప్రతిసారీ విఫలం కాలేదని, వారు నాపై ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదని, అందుకు నేను చాలా కృతజ్ఞుడను.” అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అంకిత భావాన్ని వ్యక్తం చేశారు. “మీరు మా యువతకు ఏమి బోధిస్తున్నారనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తరువాతి తరం మా సంఘంలో భాగం కావాలి.. అలాగే మీరు చాలా గర్వించాల్సిన విషయం. ఈ బీఏపీఎస్‌ మా సంఘంలో భాగమైంది. మీరు మా కమ్యూనిటీని ఎంచుకోవాలని భావించినందుకు, ఈ భూమిని నిజంగా నమ్మశక్యం కానిదిగా మార్చాలనే దృక్పథాన్ని కలిగి ఉన్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని డేవిడ్‌ అన్నారు.