AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nobel Peace Prize 2023 Winner: నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికైన నర్గీస్ మొహమ్మదీ కథ మీకు తెలుసా..? 31 ఏళ్లుగా జైలులో ఖైదీగా

ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన జర్నలిస్ట్, ఉద్యమకారిణి నర్గీస్ మొహమ్మదీ (51)కి 2023 సంవత్సారానికి గానూ నోబెల్ శాంతి బహుమతి దక్కింది. మహిళల హక్కుల కోసం పోరాడినందుకు నర్గీస్ 13 సార్లు అరెస్టయ్యారు. ఆమెకు 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు అక్కడి ప్రభుత్వం విధించింది. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు ఆమెను పలుమార్లు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. మహిళా హక్కుల కోసం..

Nobel Peace Prize 2023 Winner: నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికైన నర్గీస్ మొహమ్మదీ కథ మీకు తెలుసా..? 31 ఏళ్లుగా జైలులో ఖైదీగా
Iran Activist Narges Mohammadi
Srilakshmi C
|

Updated on: Oct 06, 2023 | 9:12 PM

Share

ఇరాన్‌, అక్టోబర్‌ 6: ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన జర్నలిస్ట్, ఉద్యమకారిణి నర్గీస్ మొహమ్మదీ (51)కి 2023 సంవత్సారానికి గానూ నోబెల్ శాంతి బహుమతి దక్కింది. మహిళల హక్కుల కోసం పోరాడినందుకు నర్గీస్ 13 సార్లు అరెస్టయ్యారు. ఆమెకు 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు అక్కడి ప్రభుత్వం విధించింది. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు ఆమెను పలుమార్లు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. మహిళా హక్కుల కోసం నర్గీస్ నిర్భయంగా మాట్లాడారని.. ఖైదీల గొంతుకగా నిలిచారని.. నోబెల్ కమిటీ ఆమెకు నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రభుత్వంపై నర్గీస్ మొహమ్మదీ దుష్ప్రచారం చేస్తున్నారని ఇరాన్ పోలీసులు ఆరోపించారు. ఆమె పొరాటాన్ని స్వదేశం గుర్తించకపోయినా యావత్ ప్రపంచం గుర్తించింది.

51 ఏళ్ల నర్గీస్ జైలులో శిక్ష అనుభవిస్తూనే..

మహిళల స్వేచ్ఛ, వారి హక్కుల కోసం తన గొంతును పెంచిన నర్గీస్ – వైట్ టార్చర్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. జైలులో ఉన్న సమయంలో ఖైదీల బాధను పుస్తకంలో నమోదు చేశాడు. ఖైదీల అనుభవాలను డాక్యుమెంట్ చేయడం, మహిళల గొంతును పెంచడం కోసం ఆమె 2022లో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) కరేజ్ అవార్డును కూడా అందుకుంది. నర్గీస్ మహిళల హక్కుల కోసం తన గొంతును పెంచడంతో పాటు, మరణశిక్ష రద్దు, ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడారు. మానవ హక్కులకు సంబంధించిన ఈ పనుల వల్ల నర్గీస్ ఇరాన్ ప్రభుత్వానికి కొరకరానికొయ్యలా తయారయ్యారు. ఫలితంగా పలుమార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

మహిళల కోసం 33 ఏళ్ల పోరాట యాత్ర

ఫిజిక్స్ చదివిన నర్గీస్ మొదట్లో ఇంజినీర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వార్తాపత్రికలకు రాయడం ప్రారంభించారు. క్రమంగా స్త్రీల హక్కుల కోసం రాయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇది 1990ల నుంచి ప్రారంభంకాగా 2011లో తొలిసారి అరెస్టయ్యారు. కానీ ఆమె ఎక్కడా ఆగలేదు, భయపడలేదు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొంది 2015లో మళ్లీ జైలుకు వెళ్లాడు. 2003లో నోబెల్ శాంతి బహుమతి పొందిన షిరిన్ ఎబాడి స్థాపించిన ప్రభుత్వేతర సంస్థ డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌కు నర్గీస్ డిప్యూటీ హెడ్‌గా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

8 ఏళ్లుగా కన్న పిల్లలకు దూరంగా..

న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్గీస్ తన పిల్లలను 8 సంవత్సరాలుగా కలవలేదని చెప్పారు. నర్గీస్‌కు ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. వారిపేర్లు అలీ, కియానా. ప్రస్తుతం నర్గీస్ ఇద్దరు కుమార్తెలు, ఆమె భర్త తాగి రహ్మానీతో కలిసి ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.