జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, భయాందోళనలు..

2006లో టోరిషిమా ద్వీపానికి సమీపంలో ఇదే తరహా భూకంపం సంభవించింది, దీనివల్ల మియాకే-జిమా వద్దకు 16 సెం.మీ సునామీ వచ్చింది. 2022 టోంగా-హంగా హ'పై అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ తర్వాత ఇజు దీవులకు సునామీ హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి. ఇకపోతే, భూమిపై అత్యధిక భూకంపాలు సంభవించే ప్రదేశాలలో జపాన్ ఒకటి. ముఖ్యంగా, 2011లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర సునామీకి దారితీసింది. ఇది ఉత్తర జపాన్‌లోని ప్రాంతాలను నాశనం చేసింది.

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, భయాందోళనలు..
Earthquake
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 07, 2023 | 7:21 AM

జపాన్‌లో ఈరోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. దక్షిణ జపాన్‌లోని తోరిషిమా ద్వీపం సమీపంలో ఈరోజు ఉదయం 11 గంటలకు 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. టోక్యోకు దక్షిణంగా 550 కిమీ (340 మైళ్లు) దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కేంద్రీకృతమైందని జపాన్ భూకంప పరిశోధన కేంద్రం తెలిపింది. అయితే, ఇక్కడి దీవిలో ప్రజలు నివసించారు..కాబట్టి దీంతో ప్రాణనష్టం ఉండదని భావిస్తున్నారు. భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. టోక్యోకు దక్షిణంగా ఉన్న రిమోట్ చైన్ ద్వీపాలకు 1 మీటర్ వరకు అలలు ఎగసిపడ్డాయి. ఇజు దీవులలో కనీసం 30 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు కనిపించాయి. తీర ప్రాంతాలు, నదీ ముఖద్వారాల సమీపంలో ఉన్న ప్రజలు కూడా ఎత్తైన ప్రాంతాలకు దూరంగా వెళ్లాలని సూచించారు. అయితే ఇదే తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం 10శాతం నుంచి 20శాతం వరకు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే వారం రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని అదే ప్రాంతంలో గత సోమవారం నుండి నేటి వరకు వరుస భూకంపాలు సంభవించాయి. అయితే, ఇప్పటివరకు, ఈ భూకంపం ఎటువంటి అసాధారణమైన అగ్నిపర్వత పేలుడు, సునామీ వంటివి కలిగించలేదు. 2006లో టోరిషిమా ద్వీపానికి సమీపంలో ఇదే తరహా భూకంపం సంభవించింది, దీనివల్ల మియాకే-జిమా వద్దకు 16 సెం.మీ సునామీ వచ్చింది. 2022 టోంగా-హంగా హ’పై అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ తర్వాత ఇజు దీవులకు సునామీ హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి.

ఇకపోతే, భూమిపై అత్యధిక భూకంపాలు సంభవించే ప్రదేశాలలో జపాన్ ఒకటి. ముఖ్యంగా, 2011లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర సునామీకి దారితీసింది. ఇది ఉత్తర జపాన్‌లోని ప్రాంతాలను నాశనం చేసింది. ఫుకుషిమా అణు కర్మాగారంలోని మూడు రియాక్టర్లను కరిగించడానికి కారణమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..