- Telugu News Photo Gallery Narges Mohammadi got 2023 Nobel Peace Prize for fight against oppression of women in Iran
Nobel Peace Prize: జైలు శిక్ష అనుభవిస్తోన్న మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.
2023 ఏడాదికిగాను వివిధ రంగాల్లో నోబెల్ బహముతులు గెలుచుకున్న వారి పేర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నోబెల్ శాంతి బహుమతి విజేతను నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన నార్గెస్ మెమహమ్మది అనే మహిళను ఈసారి నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇంతకీ ఎవరీ నార్గెస్ మొమహ్మది, ఈమె ఏం చేసిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...
Updated on: Oct 07, 2023 | 9:51 AM

2023 ఏడాదికి గాను నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారం మొదలైన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు ఈ పురస్కరాల ప్రకటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం.. 2023 ఏడాదికిగా నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు.

ఈ ఏడాదికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఇరాన్‌కు చెందిన నార్గెస్ మెమహమ్మది అనే మహిళను వరించింది. ప్రస్తుతం ఈమె జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఇంతకీ నార్గెస్ ఏం చేసింది.? ఎందుకు జైల్లో ఉంది.? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

నార్గెస్ మొహమ్మది ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త. ఈమె ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరు చేసింది. ఇరాన్ ప్రభుత్వం నార్గెస్‌ను ఏకంగా 13 సార్లు అరెస్ట్ చేసింది, ఐదు సార్లు దోషిగా ప్రకటించింది. మహిళలకు మద్ధతుగా పోరు చేసినందుకుగాను నార్గెస్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినట్లు నార్వే నోబెల్ కమిటీ తెలిపింది.

నార్గెస్‌కు మొత్తం 31 ఏళ్ల జైలు శిక్షవిధించారు. దీంతో పాటు 154 కొరడా దెబ్బలు కొట్టినట్లు, ఆమె సాహోసోపేతమైన పోరాంట వ్యక్తిగతంగా తీవ్ర నష్టం కలిగించినట్లు నార్వే నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. ఇక నార్గెస్ ప్రస్తుతం ఇంకా జైల్లోనే ఉన్నారు. 2022 సెప్టెంబర్‌లో హిజాబ్ ధరించలేదన్న కారణంగా ఇరాన్‌కు చెందిన ఓ 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ మహిళ పోలీసుల కస్టడీలో చనిపోయింది. ఆ తర్వాత దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి, యువతి మృతికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ అల్లర్లలోనే నార్గెస్ మొహమ్మదిని ఇరాన్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఈ సమయంలో ఇరాన్‌లో తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. పోలీసుల కాల్పుల్లో ఏకంగా 500 మంది చనిపోయారు.

దిలా ఉంటే నోబెల్ శాంతి పురస్కారం పొందిన 19వ మహిళగా నార్గెస్ అరుదైన ఘనతను సాధించింది. రెండో ఇరాన్ మహళగా కూడా నిలిచింది. ఇరాన్ నుంచి శాంతి బహమతి అందుకున్న తొలి మహిళగా శిరిన్ ఎబది అనే మహిళ నిలిచారు. 2003లో ఆమెకు ఈ అవార్డు వరించింది. శిరిన్ కూడా మానవ హక్కుల కార్యకర్తగా పనిచేశారు. ఇక నోబెల్ ఇతర బహుమతల్లా కాకుండా ఈ శాంతి బహుమతిని నార్వే నోబెల్ కమిటీ ఓస్లోలో ప్రకటించడం అనావాయితీగా వస్తోంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి పురస్కారం కోసం మొత్తం 351 నామినేషన్లు వచ్చిన నార్వే నోబెల్ కమిటీ తెలిపింది.
