Free OTT: ఉచితంగా ఓటీటీ సేవలు, మరెన్నో బెనిఫిట్స్‌… జియో నుంచి మూడు కొత్త ప్లాన్స్..

మెజారిటీ టెలికం కంపెనీలు తమ రెగ్యులర్‌ సర్వీస్‌తో పాటు ఓటీటీ సేవలను సైతం అందిస్తున్నాయి. అది కూడా ఉచితంగా. ఈ రేసులో ఇప్పటికే ముందు వరుసలో ఉన్న ప్రముఖ టెలికం దిగ్గజం రియలన్స్‌ తాజాగా మరికొన్ని కొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే మూడు ప్లాన్స్‌తో తీసుకొచ్చింది. ఏడాది వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు...

Free OTT: ఉచితంగా ఓటీటీ సేవలు, మరెన్నో బెనిఫిట్స్‌... జియో నుంచి మూడు కొత్త ప్లాన్స్..
Recharge Plans
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 06, 2023 | 7:55 AM

ప్రస్తుతం ఓటీటీ బిజినెస్‌ ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత ఓటీటీ సేవలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇక బడా నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ మార్కెట్లోకి అడుగుపెట్టడం, ఓటీటీ కోసం భారీ బడ్జెట్‌తో ప్రాజెక్ట్‌లను చేపట్టడంతో ఈ క్రేజ్‌ మరింత పెరిగింది. దీంతో దీనిని టెలికం కంపెనీలు సైతం క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి.

మెజారిటీ టెలికం కంపెనీలు తమ రెగ్యులర్‌ సర్వీస్‌తో పాటు ఓటీటీ సేవలను సైతం అందిస్తున్నాయి. అది కూడా ఉచితంగా. ఈ రేసులో ఇప్పటికే ముందు వరుసలో ఉన్న ప్రముఖ టెలికం దిగ్గజం రియలన్స్‌ తాజాగా మరికొన్ని కొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే మూడు ప్లాన్స్‌తో తీసుకొచ్చింది. ఏడాది వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు సోనీ లివ్‌, జీ5 వంటి ఓటీటీ సబ్‌స్ట్రిప్షన్స్‌ను పూర్తి ఉచితంగా పొందే అవకాశం ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా ప్లాన్స్‌.? వాటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

రూ. 3662 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే కస్టమర్లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తాయి. అలాగే రోజుకు 2.5 జీబీ డేటాను అందిస్తారు. ఇక రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా అందిస్తారు. వీటితో పాటు సోనీలివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు. వీటికి అదనంగా జియో సినిమా, జియో క్లౌడ్‌ వంటి సేవలను పొందొచ్చు. ఈ ప్లాన్‌ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

రూ. 3226 ప్లాన్..

ఈ ప్లాన్‌కూడా ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు డేలీ 2జీబీ డేటాను అందిస్తారు. ఇక రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉంటాయి. వీటితోపాటు సోనీలివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా పొందొచ్చు. వీటికి అదనంగా జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ వంటి సేవలను ఉచితంగా పొందొచ్చు.

రూ. 3225 ప్లాన్..

జియో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ఇది. ఇది కూడా ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు, రోజు 2జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. ఈ ప్లాన్‌లో కేవలం జీ5 సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే పొందొచ్చు. దీనికి అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలను పొందొచ్చు.

మరో ప్లాన్‌..

ఇక ఓటీటీ సేవలు వద్దనుకునే వారి కోసం కూడా జియో ఒక ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 1999తో రీచార్జ్‌ చేస్తే ఏడాది వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 2.5 జీబీ 4జీ డేటాను పొందొచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందిస్తారు. అయితే ఇందులో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను అవకాశం లేదు. కానీ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలను పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్