Vivo Y 17s: మార్కెట్‌లోకి మరో నయా ఫోన్‌ రిలీజ్‌ చేస్తున్న వివో.. బడ్జెట్‌ ధరలోనే స్టన్నింగ్‌ ఫీచర్లు..

రుగుతున్న టెక్నాలజీ ప్రకారం ఎప్పటికప్పుడు కంపెనీలు ఫోన్లు లాంచ్‌ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో 5జీ వెర్షన్‌ ఫోన్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్ల ద్వారా కొనుగోలు ఇష్టపడుతున్నారు. కంపెనీలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ఫోన్లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా వివో కంపెనీ నయా స్మార్ట్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేస్తుంది. వివో వై 17 ఎస్‌ పేరుతో భారీ బ్యాటరీతో ఫోన్‌ను రిలీజ్‌ చేసింది.

Vivo Y 17s: మార్కెట్‌లోకి మరో నయా ఫోన్‌ రిలీజ్‌ చేస్తున్న వివో.. బడ్జెట్‌ ధరలోనే స్టన్నింగ్‌ ఫీచర్లు..
Vivo Y 17s
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 06, 2023 | 8:00 PM

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట​ విపరీతంగా వృద్ధి చెందుతుంది. ప్రతి ఇంట్లో అవసరానికి తగ్గట్టు ఒకటి నుంచి మూడు స్మార్ట్‌ ఫోన్ల వరకూ వాడుతున్నారంటే వీటి డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు. అలాగే పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం ఎప్పటికప్పుడు కంపెనీలు ఫోన్లు లాంచ్‌ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో 5జీ వెర్షన్‌ ఫోన్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్ల ద్వారా కొనుగోలు ఇష్టపడుతున్నారు. కంపెనీలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ఫోన్లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా వివో కంపెనీ నయా స్మార్ట్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేస్తుంది. వివో వై 17 ఎస్‌ పేరుతో భారీ బ్యాటరీతో ఫోన్‌ను రిలీజ్‌ చేసింది.

ముఖ్యంగా ఈ ఫోన్‌ 50 ఎంపీ కెమెరాతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ద్వారా పని చేస్తుంది. ఈ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 4 జీబీ + 64 జీబీ, 4 జీబీ + 128 జీబీ వేరియంట్స్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంటుంది. అలాగే 4 జీబీ వేరియంట్‌ ధర రూ.11,499గా ఉంటే 4 జీబీ + 128 జీబీ వేరియంట్‌ ధర రూ.12,499కు అందుబాటులో ఉంటున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో దేశంలోని అధీకృత రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ తాజా ఫీచర్లను గురించి ఓ సారి తెలుసుకుందాం.

వివో వై 17 ఎస్‌ ఫీచర్లు ఇవే

వివో వై 17 720×1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌వాటర్ డ్రాప్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా పని చేస్తుంది. అలాగే ఫన్‌ టచ్‌ ఓఎస్‌ 13 ద్వారా పని చేసే ఈ ఫోన్‌ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియా టెక్‌ హీలియో జీ 85 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా వినియోగదారులు స్టోరేజీని మరింత విస్తరించుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌ ఐపీ 54 రేటింగ్‌తో వస్తుంది. అంటే ఈ ఫోన్‌ దుమ్ము, స్ప్లాష్ నీటి నిరోధకతతో ఫోన్‌కు రక్షణ కల్పిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ వెనుక కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరాతో పాటు ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ వస్తుంది. అలాగే 15వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా నిలుస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!