Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nokia 2660: కీ ప్యాడ్‌ ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్స్‌ సపోర్ట్‌తో ఫ్లిప్‌ ఫోన్‌ రిలీజ్‌ చేసిన నోకియా.. ఫీచర్ల వివరాలివే..!

భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటికీ గ్రామీణులు కీ ప్యాడ్‌ ఫోన్లను వాడడాన్ని ఇష్టపడుతున్నారు. అలాగే నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్‌ పెరగాయి. ఈ రెండు విషయాలను పరిగణలోకి తీసుకుని నోకియా ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌కు సపోర్ట్‌ చేసేలా కీ ప్యాడ్‌ ఫ్లిప్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేసింది.

Nokia 2660: కీ ప్యాడ్‌ ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్స్‌ సపోర్ట్‌తో ఫ్లిప్‌ ఫోన్‌ రిలీజ్‌ చేసిన నోకియా.. ఫీచర్ల వివరాలివే..!
Nokia 2660
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 06, 2023 | 8:15 PM

భారతదేశంలోని టెలికాం రంగంలో నోకియా ఫోన్లకు ఉండే క్రేజ్‌ వేరు. ముఖ్యంగా కీ ప్యాడ్‌ ఫోన్‌ సెగ్మెంట్‌లో నోకియా ఫోన్లు గతంలో ఓ బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేశాయి. అయితే క్రమేపి మార్కెట్‌లో స్మార్ట్‌ ఫోన్లు హవా పెరగడంతో నోకియా ఫోన్లు కనుమరుగయ్యాయి. నోకియా కూడా ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్లను తయారు చేసినా ఆండ్రాయిడ్‌ ఫోన్లకు గట్టి పోటీనివ్వలేకపోయాయి. తర్వాత నోకియా ఫోన్ల తయారీ లైసెన్స్‌ హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ చేజిక్కించుకుంది. అయితే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటికీ గ్రామీణులు కీ ప్యాడ్‌ ఫోన్లను వాడడాన్ని ఇష్టపడుతున్నారు. అలాగే నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్‌ పెరగాయి. ఈ రెండు విషయాలను పరిగణలోకి తీసుకుని నోకియా ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌కు సపోర్ట్‌ చేసేలా కీ ప్యాడ్‌ ఫ్లిప్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. నోకియా 2660 ఫ్లిప్ ఫోన్‌ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ ఫోన్‌ నుంచి స్కాన్‌ చేసి యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఈ ఫోన్‌ ధర ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

ఈ ఫోన్‌ సాధారణ బటన్ ప్రెస్‌తో సురక్షితమైన, సౌకర్యవంతమైన డిజిటల్ లావాదేవీలను చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ నోకియా 2660 ఫ్లిప్‌ కొత్త కొనుగోలుదారులకు మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ ఫోన్‌ వాడుతున్న వారికి కూడా అందుబాటులో ఉంటుంది. హెచ్‌ఎండీ ఈ ఫోన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇప్పటికే ఉన్న బేస్‌ మోడల్‌కు విడుదల చేసింది. తద్వారా ప్రతి ఒక్కరికీ డిజిటల్ చెల్లింపు చేరికను నిర్ధారిస్తుంది. ఈ ఫోన్‌లు ప్రస్తుతం రెండు కొత్త రంగులలో కూడా వస్తున్నాయి. పాప్ పింక్, లష్ గ్రీన్ రంగుల్లో కొనుగోలుకు సిద్దంగా ఉన్నాయి. నోకియా 2660 ఫ్లిప్ అనేది స్థిరమైన క్లామ్‌షెల్ డిజైన్‌తో కూడిన క్లాసిక్ ఫ్లిప్ ఫోన్. ఈ ఫోన్‌ ధర రూ. 4,699గా ఉంది. అలాగే ఈ ఫోన్‌  నలుపు, ఎరుపు, నీలం రంగు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌ను నోకియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో అధీకృత రిటైలర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. 

నోకియా 2660 ఫ్లిప్‌ ఫోన్‌ ఫీచర్లు

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ 2.8-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ముఖ్యంగా దీని బ్యాటరీ మన్నిక అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే ఈ ఫోన్‌ అత్యవసర పరిస్థితుల్లో ముందస్తుగా సేవ్ చేసిన పరిచయాలతో స్విఫ్ట్ కమ్యూనికేషన్‌ను సులభతరం చేస్తూ ఒక ఎమర్జెన్సీ బటన్ కూడా పొందుపరిచారు. ఈ నోకియా ఫ్లిప్ ఫోన్ వోల్ట్‌ సపోర్ట్‌తో సహా డ్యూయల్ 4జీ కనెక్టివిటీని కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్‌లో రిమూవబుల్‌ 1450 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫీచర్ ఫోన్ మైక్రో ఎస్‌డీ కార్డ్‌లకు మద్దతు ఇస్తుంది.  సిరీస్ 30 ప్లస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. వీజీఏ కెమెరాతో పాటు ఎఫ్‌ఎం రేడియో సపోర్ట్‌ ఉండడం వల్ల ఈ ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

అక్షయ తృతీయతో వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
అక్షయ తృతీయతో వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
నాని యాక్టింగ్ చాలా ఇష్టం.. అతడితో నటించాలని ఉంది..
నాని యాక్టింగ్ చాలా ఇష్టం.. అతడితో నటించాలని ఉంది..
ప్రపంచంలోనే అరుదైన 'గోల్కొండ బ్లూ' వజ్రం వేలం..
ప్రపంచంలోనే అరుదైన 'గోల్కొండ బ్లూ' వజ్రం వేలం..
డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది
డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది
జాబిల్లి ఈ సుకుమారి వద్ద వెన్నలను అరువు అడగదా.. స్టన్నింగ్ ప్రగ్య
జాబిల్లి ఈ సుకుమారి వద్ద వెన్నలను అరువు అడగదా.. స్టన్నింగ్ ప్రగ్య
'ఓదెల 2' మూవీ విలన్ భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా?
'ఓదెల 2' మూవీ విలన్ భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా?
వామ్మో.. పుత్తడి రికార్డ్‌ బ్రేక్‌..లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర
వామ్మో.. పుత్తడి రికార్డ్‌ బ్రేక్‌..లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర
మత్తు కోసం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ కలిపి తీసుకుని యువకుడు మృతి
మత్తు కోసం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ కలిపి తీసుకుని యువకుడు మృతి
వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌
వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది.. అలా పోతుంది
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది.. అలా పోతుంది