Nokia G42 5G: 11న నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్!
నోకియా ఫోన్‌లకు డిమాండ్ గణనీయంగా తగ్గింది. అయితే ఇతర కంపెనీల నుంచి రకరకాల స్మా్ర్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను అందిస్తూ బడ్జెట్ ధరల్లో తయారు చేస్తున్నాయి. అయితే గతంలో హవా కొనసాగించిన నోకియా.. స్మార్ట్‌ఫోన్ లను పెద్దగా అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. ఇక దేశంలో అప్పుడప్పుడు మంచి మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి..

ఇండియాలో ఇప్పుడు నోకియా కంపెనీ ఫోన్లకు డిమాండ్ లేదు. Xiaomi, OnePlus, Samsung, Oppo వంటి బ్రాండ్లు ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టిన తర్వాత, నోకియా ఫోన్‌లకు డిమాండ్ గణనీయంగా తగ్గింది. అయితే ఇతర కంపెనీల నుంచి రకరకాల స్మా్ర్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను అందిస్తూ బడ్జెట్ ధరల్లో తయారు చేస్తున్నాయి. అయితే గతంలో హవా కొనసాగించిన నోకియా.. స్మార్ట్‌ఫోన్ లను పెద్దగా అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. ఇక దేశంలో అప్పుడప్పుడు మంచి మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు అదే వరుసలో కంపెనీ కొత్త Nokia G42 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 11న భారత్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు.
నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇది పర్పుల్, పింక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ స్నాపర్, స్లిమ్ బెజెల్స్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్ అందించబడింది. ఇది వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రిపుల్ కెమెరా ఎంపిక ఇవ్వబడింది. టీజర్‌లో ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా క్యాప్చర్ చేయబడింది.
నోకియా G42 5G ఫీచర్లు:
డిస్‌ప్లే: నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, సెల్ఫీ షూటర్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది.
చిప్‌సెట్: హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ SoC, గ్రాఫిక్స్ కోసం Adreno GPUతో అందించింది కంపెనీ.
ర్యామ్, స్టోరేజీ: 4GB/6GB RAM, 128GB నిల్వతో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా దీనిని మరింత విస్తరించవచ్చు. 5జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది.
OS: నోకియా G42 స్మార్ట్‌ఫోన్ Android 13 OS పై రన్ అవుతుంది.
కెమెరాలు: 50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ మాడ్యూల్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించింది కంపెనీ.
బ్యాటరీ: ఈ ఫోన్ 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
కనెక్టివిటీ: కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఛార్జర్ ఉన్నాయి.
ఇతర ఫీచర్స్: భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, నీరు, ధూళి నిరోధకత కోసం IP52 రేటింగ్, 3.5mm ఆడియో జాక్.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి