- Telugu News Photo Gallery Political photos Follow these tricks to see whatsapp status without them knowing Telugu Tech News
Whatsapp Tricks: ఎదుటి వారికి తెలియకుండా వారి టాట్సాప్ స్టేటస్ చూడాలా.? ఇలా చేయండి..
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మనం ఉపయోగించే వాట్సాప్‌లో మనకు తెలియని ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని మీకు తెలుసా.? అలాంటి వాటిలో ఒకటి మనం స్టేటస్ చూసినట్లు పోస్ట్ చేసిన వారికి తెలియకుండా ఉండడం. ఇందుకోసం కొన్ని రకాల ఆప్షన్స్‌లో అందుబాటులోకి ఉన్నాయి అవేంటంటే..
Updated on: Sep 10, 2023 | 9:51 AM

వాట్సాప్‌లో బాగా పాపులర్ అయిన ఫీచర్స్‌లో స్టేటస్ ఒకటి. అయితే వాట్సాప్‌లో ఎవరైనా పోస్ట్ చేసిన స్టేటస్ చూడగానే మనకు వెంటనే ఎవరెవరు చూశారన్నది తెలిసిపోతుంది. అలా కాకుండా మీరు స్టేటస్ చూసినట్లు ఎదుటి వ్యక్తికి తెలియకుండా కూడా చేయొచ్చనే విషయం మీకు తెలుసా.?

మొదటి ఆప్షన్ ఇన్ కాగ్నిటో మోడ్ ఆన్.. ఒకవేళ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే. మొదట ఇన్ కాగ్నిటో మోడ్‌లో బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం సదరు స్టేటస్‌ను లింక్‌ను అందులో ఓపెన్ చేస్తే చూస్తే చాలు మీరు వాట్సాప్ స్టేటస్ చూసినట్లు సదరు వ్యక్తికి తెలియదు.

వాట్సాప్ చూసినట్లు తెలియకుండా చేసే మరో ఆప్షన్ ఆఫ్‌లైన్‌లో వాట్సాప్. ఇందుకోసం ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం స్టోరీలన్నీ లోడ్ అయ్యేంత వరకు కాసేపు వేచి చూడాలి. ఆ తర్వాత నెట్ ఆఫ్ చేసి మీకు కావాల్సిన వ్యక్తి స్టేటస్‌ను ఓపెన్ చేయండి. ఇలా చేసినా మీరు స్టేటస్ చూసినట్లు తెలియదు.

ఇక మరో ఆప్షన్.. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఫైల్ మేనేజర్ పేరుతో ఓ ఫోల్డర్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ ఫోల్డర్‌లో స్టేటస్‌లు సేవ్ అయి ఉంటాయి. సదరు ఫోల్డర్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన వారి స్టేటస్‌ను సీక్రెట్‌గా చూడొచ్చు.

రీడ్ రిసీట్ ఆప్షన్ బ్లూ టిక్ కనిపించకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని మనం అనుకుంటాం. అయితే ఇదే ఆప్షన్‌తో స్టేటస్ చూసినట్లు తెలియకుండా చూసుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా స్టేటస్‌ను చూసినట్లు కనిపించదు, అలాగే బ్లూటిక్ కూడా రాదు.





























