Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy A34: శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ. 4,000 తగ్గింపు.. మిస్ అవ్వొద్దు..

శామ్సంగ్ గెలాక్సీ ఏ34 మోడల్ పై ఆ కంపెనీ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. శామ్సంగ్ ఇండియా అధికారిక ఆన్ లైన్ స్టోర్ లో ఈ మిడ్ రేంజ్ ఫోన్ పై రూ. 4000 వరకూ తగ్గింపును అందిస్తోంది. అయితే తాత్కాలికంగానే ఈ ఆఫర్ ను అందిస్తోందని చెబుతున్నారు. ఈ కొత్త శామ్సంగ్ ఫోన్ లో అమోల్డ్ డిస్ ప్లే , ఐపీ రేటింగ్, స్టీరియో స్పీకర్స్ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాాం..

Samsung Galaxy A34: శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ. 4,000 తగ్గింపు.. మిస్ అవ్వొద్దు..
Samsung Galaxy A34 5g
Follow us
Madhu

|

Updated on: Sep 10, 2023 | 1:19 PM

ఆండ్రాయిడ్ ఫోన్లలో శామ్సంగ్ గెలాక్సీ తనదైన ముద్ర వేసుకుంది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికీ టాప్ సెల్లింగ్ ఫోన్లుగా ఈ శామ్సంగ్ గెలాక్సీ మోడళ్లు నిలుస్తాయి. కాగా ఇటీవల విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ ఏ34 మోడల్ పై ఆ కంపెనీ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. శామ్సంగ్ ఇండియా అధికారిక ఆన్ లైన్ స్టోర్ లో ఈ మిడ్ రేంజ్ ఫోన్ పై రూ. 4000 వరకూ తగ్గింపును అందిస్తోంది. అయితే తాత్కాలికంగానే ఈ ఆఫర్ ను అందిస్తోందని చెబుతున్నారు. ఈ కొత్త శామ్సంగ్ ఫోన్ లో అమోల్డ్ డిస్ ప్లే , ఐపీ రేటింగ్, స్టీరియో స్పీకర్స్ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ అసలు ధర ఎంత? తగ్గింపుపై ఇది ఎంతకు లభిస్తుంది? ఈ ఫోన్లో ఉండే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శామ్సంగ్ గెలాక్సీ ఏ34 ధర ఇలా..

శామ్సంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ పై రూ. 26,999గా ఉంది. వాస్తవానికి ఈ 5జీ ఫోన్ కొంత కాలం క్రితం రూ. 30,999 ప్రారంభ ధరతో దీనిని మన దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిపై శామ్సంగ్ రూ. 4,000 ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. వాస్తవానికి శామ్సంగ్ చాలా అరుదుగా ఇలాంటి ఆఫర్లు ఇస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఏ34, స్పెక్స్ అండ్ ఫీచర్లు..

ఈ శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లో 6.6 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఇది వస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెకండరీ సెన్సార్, 5ఎంపీ మాక్రో సెన్సార్ ఉంటుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది. ఐపీ67 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ఫోన్లో డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. నాలుగేళ్ల వరకూ ఆండ్రాయిడ్ ఓఎస్ సపోర్టు, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫోన్ లాభదాయకమేనా..

శామ్సంగ్ గెలాక్సీ ఏ34 స్మార్ట్ ఫోన్ లో శక్తివంతమైన డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, మంచి పనితీరును అందించగల 5జీ ఫోన్ ఇది. అయితే ఈ ఫోన్ ను కొనుగోలు చేసేవారికి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ ఫోన్ ప్యాక్ లో చార్జర్ ఉండదు. వినియోగదారులు చార్జర్ కోసం అదనంగా చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. దీని కెమెరాలు మంచి పనితీరును కలిగి ఉంటాయి. కానీ వీడియో రికార్డింగ్ కోసం బడ్జెట్ ఫోన్ కావాలనుకునే వ్యక్తులు ఇతర ఎంపికల కోసం వెతకవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..