- Telugu News Photo Gallery Technology photos Iqoo launching new smartphone Iqoo 12 series features and price Telugu Tech news
iQoo 12 Series: ఇయర్ ఎండ్‌కి ఐక్యూ నుంచి మార్కెట్లోకి కొత్త ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఐక్యూ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐక్యూ 12 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకురానుంది. గతేడాది ఐక్యూ 11, 11 ప్రో ఫోన్‌లను తీసుకొచ్చిన ఈ కంపెనీ ఏడాది తర్వాత ఇప్పుడు 12 సిరీస్‌ను తీసుకొస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఐక్యూ 12 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 10, 2023 | 9:11 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఐక్యూ 12 సిరీస్‌లో భాగంగా ఐక్యూ 12, ఐక్యూ 12 ప్రో ఫోన్‌లను తీసుకురానున్నారు. ఈ ఫోన్‌లు ఇప్పటికే చైనాలో అందుబాటులోకి రాగా, త్వరలోనే భారత్‌లోనే లాంచ్ కానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఈ7 అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 2కే రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే సొంతం.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. పెరిస్కోప్ లెన్స్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే సెల్ఫీ కెమెరాకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఇక ఐక్యూ 12 ప్రో వేరియంట్‌లో 200 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 24 జీబీ ర్యామ్‌ను ఇవ్వనున్నారు. అలాగే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, యూఎస్బీ టైప్‌సీ 3 ఎక్స్ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు.





























