Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo 5G Phone: వారెవ్వా వివో.. కేవలం రూ. 11,999కే 5జీ ఫోన్.. పూర్తి వివరాలు ఇవి..

అతి తక్కువ ధరలో వివో నుంచి రెండు 5జీ ఫోన్లు ఇటీవల మార్కెట్లో విడుదల అయ్యాయి. కేవలం రూ. 20,000 లోపు ధరలోనే వివో టీ2 5జీ( Vivo T2 5G), వివో టీ2ఎక్స్ 5జీ( Vivo T2x 5G) అందుబాటులోనే ఉన్నాయి. దీనిలో వివో టీ2ఎక్స్ 5జీ దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ గా నిలిచిపోనుంది.

Vivo 5G Phone: వారెవ్వా వివో.. కేవలం రూ. 11,999కే 5జీ ఫోన్.. పూర్తి వివరాలు ఇవి..
Vivo T2x 5g
Follow us
Madhu

|

Updated on: Apr 22, 2023 | 2:44 PM

టెక్ రంగంలో 5జీ ట్రెండ్ షురూ అయ్యింది. సూపర్ స్పీడ్ ఇంటర్ నెట్ తో పాటు అత్యాధునిక ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో 5జీ సపోర్టుతో కూడిన స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. దీంతో కంపెనీలు మార్కెట్లోకి 5జీ ఫోన్లను పెద్ద ఎత్తున లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో అతి తక్కువ ధరలో వివో నుంచి రెండు 5జీ ఫోన్లు ఇటీవల మార్కెట్లో విడుదల అయ్యాయి. కేవలం రూ. 20,000 లోపు ధరలోనే వివో టీ2 5జీ( Vivo T2 5G), వివో టీ2ఎక్స్ 5జీ( Vivo T2x 5G) అందుబాటులోనే ఉన్నాయి. దీనిలో వివో టీ2ఎక్స్ 5జీ దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ గా నిలిచిపోనుంది. ఇప్పుడు ఈ వివో టీ2ఎక్స్ 5జీకి సంబంధించిన ఫీచర్లు, డిజైన్, ధర ఇతర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వివో టీ2ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు ఇవి..

ఈ వివో టీ2ఎక్స్ 5జీ ఫోనులో టియర్ డ్రాప్ నాట్జ్ కలిగిన 6.58 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. దీనిలో డైమెన్సిటీ 6020 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, దీనిని మరో 3జీబీ వర కూ ఎక్స్డెంట్ చేసుకోవచ్చు. 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఇది వస్తుంది. దీనిలోని బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో 18వాట్స్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది.

కెమెరా క్వాలిటీ..

ఈ ఫోన్ లో 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50ఎంపీ, మరో 2ఎంపీ డెప్త్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే యూఎస్బీ సీ పోర్టు, బ్లూటూత్ 5.1, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

ఈ వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్ 4జీబీ, 6జీబీ, 8జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడళ్ల ధరలు మన ఇండియాలో వరుసగా రూ. 12,999, రూ. 13,999, రూ. 15,999 ఉంటాయి. ఈ మూడింటికీ ఇంటర్నల్ స్టోరేజ్ 128జీబీ ఉంటుంది. ఇది ఫ్లిప్ కార్ట్ తో పాటు వివో ఇండియా ఆన్ లైన్ స్టోర్ లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇది గ్లిమ్మర్ బ్లాక్, మెరైన్ బ్లూ, ఆరోరా గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ప్రత్యేక ఆఫర్లు..

వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్ పై ప్రత్యేక ఆఫర్లు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి. హెడ్ ఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ల కొనుగోలు చేస్తే డిస్కౌంట్లు లభిస్తాయి. కేవలం రూ.11,999కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..