Credit Score: అకస్మాత్తుగా సిబిల్ స్కోర్ డ్రాప్ అయ్యిందా? ఇలా చేస్తే వెంటనే మెరుగవుతుంది..

సిబిల్ స్కోర్ ను సక్రమంగా మెయింటేన్ చేయాలి. ఏమాత్రం అటుఇటు అయినా ఆ స్కోర్ అమాంతం పడిపోతుంది. చాలా మంది సిబిల్ స్కోర్ బాగుండాలంటే తీసుకున్న లోన్ కి సంబంధించి ఈఎంఐ సక్రమంగా కడిటే సరిపోతుందని భావిస్తారు. కానీ అదొక్కటే కాదు.. ఇంకా చాలా అంశాలు సిబిల్ స్కోర్ ని ప్రభావితం చేస్తాయి. అయితే ఈఎంఐ బిల్లులు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.

Credit Score: అకస్మాత్తుగా సిబిల్ స్కోర్ డ్రాప్ అయ్యిందా? ఇలా చేస్తే వెంటనే మెరుగవుతుంది..
Cibil Score
Follow us

|

Updated on: Jul 08, 2024 | 2:31 PM

క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్.. ఈ పదం చాలా మంది వినే ఉంటారు. ముఖ్యంగా బ్యాంకుల్లో ఏదైనా లోన్ల కోసం దరఖాస్తు చేసుకునే సందర్భంలో తప్పనిసరిగా ఈ క్రెడిట్ స్కోర్ గురించి బ్యాంకర్లు అడుగుతారు. ఇది తగిన విధంగా ఉంటేనే సులభంగా లోన్లు మంజూరవుతాయి. తక్కువ వడ్డీ కి లోన్లు వస్తాయి. అందుకే వ్యక్తులు ఈ సిబిల్ స్కోర్ ను సక్రమంగా మెయింటేన్ చేయాలి. ఏమాత్రం అటుఇటు అయినా ఆ స్కోర్ అమాంతం పడిపోతుంది. చాలా మంది సిబిల్ స్కోర్ బాగుండాలంటే తీసుకున్న లోన్ కి సంబంధించి ఈఎంఐ సక్రమంగా కడిటే సరిపోతుందని భావిస్తారు. కానీ అదొక్కటే కాదు.. ఇంకా చాలా అంశాలు సిబిల్ స్కోర్ ని ప్రభావితం చేస్తాయి. అయితే ఈఎంఐ బిల్లులు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. వరుసగా రెండు ఈఎంఐలు చెల్లించకపోతే ఈ సిబిల్ స్కోర్ పై రెడ్ మార్క్ పడినట్లే లెక్క. ఈ నేపథ్యంలో క్రెడిట్ సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలి? దానిని ప్రభావితం చేసే అంశాలేంటి? తెలుసుకుందాం రండి..

సిబిల్ స్కోర్ అంటే..

సిబిల్ స్కోర్ మీ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. మీకున్న లోన్లు.. వాటి ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, వాటి చెల్లింపులు, మీ రాబడి మీ ఖాతాలో ఉంటున్న బ్యాలెన్స్ వంటివన్నీ బేరీజు వేసుకుని స్కోర్ ఇస్తారు. కొన్ని ఏజెన్సీలు ఈ సిబిల్ స్కోర్ ను అందిస్తాయి. సాధారణంగా ఈ స్కోర్ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కి పైగా ఉంటే మంచి సిబిల్ స్కోర్ కింద లెక్కిస్తారు. అప్పుడు సులభంగా లోన్లు రావడంతో పాటు తక్కువ వడ్డీకి లోన్లు మంజూరవుతాయి. ప్రధానంగా హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు వంటివి దీని ఆధారంగానే మంజూరు చేస్తారు.

క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుంది?

  • ఇటీవల చాలా మంది వినియోగదారులు తమ లోన్ ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తున్నామని, అయితే ఇప్పటికీ తమ క్రెడిట్ స్కోర్ బాగా లేదని చెబుతున్నారు. మరి ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..
  • మీరు సకాలంలో ఈఎంఐ చెల్లించి, క్రెడిట్ కార్డ్ బిల్లులో మినిమమ్ బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తే, అది మీ క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, క్రెడిట్ స్కోర్ను సరిచేయడానికి, వినియోగదారులు కొన్ని నెలల పాటు పూర్తి చెల్లింపును చెల్లించవలసి ఉంటుంది. పూర్తి చెల్లింపు కొన్ని నెలల తర్వాత మాత్రమే క్రెడిట్ స్కోర్ మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది.
  • మీరు ఒక లోన్ కోసం ఈఎంఐ చెల్లిస్తూ.. దానితో పాటు మీరు మరొక లోన్ తీసుకున్నట్లయితే, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్యను దాని మూలాల నుంచి తొలగించడానికి, మీరు ఏదైనా ఒక రుణాన్ని ఒకేసారి చెల్లించాలి. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.

క్రెడిట్ స్కోర్ను ఎలా తనిఖీ చేయాలి..

  • ముందుగా మీరు వెబ్ సైట్ కి వెళ్లండి.
  • ఇప్పుడు మీరు ‘గెట్ యువర్ సిబిల్ స్కోర్’ పై క్లిక్ చేయాలి.
  • దీని తర్వాత మీ పేరు, ఇ-మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ ని ఎంటర్ చేసి, మీ ఐడీని సమర్పించండి.
  • దీని తర్వాత, పిన్ కోడ్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ను నమోదు చేసి, ‘కంటిన్యూ’ ని ఎంచుకోండి.
  • ఇప్పుడు మొబైల్ ఫోన్లో వచ్చిన ఓటీపీని నమోదు చేసి, ‘కంటిన్యూ’పై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత, డ్యాష్ బోర్డ్కి వెళ్లడం ద్వారా, మీ క్రెడిట్ స్కోర్ ను చూడొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!