AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Welfare: మహిళలకు ప్రతినెలా రూ.1500.. ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ స్కీమ్ ఇది..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు మీదుగా ఇందిరా గాంధీ ప్యారీ బెహనా సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందజేస్తారు. మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే వారి జీవన పరిస్థితులు మెరుగు పడతాయని, వారికి కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

Women Welfare: మహిళలకు ప్రతినెలా రూ.1500.. ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ స్కీమ్ ఇది..
Money
Madhu
|

Updated on: Mar 18, 2024 | 6:23 AM

Share

మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటి ద్వారా ఆర్థిక సాయం అందించి, వారి జీవితాలు ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నాయి. స్త్రీకి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే ఆ కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది. సమాజం బాగుపడుతుంది. దేశం కూడా అభ్యున్నతి సాధిస్తుంది. అందుకే మహిళల పేరుమీదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది మహిళల ఆర్థిక వృద్ధిక సాయపడగలదని ఆ ప్రభుత్వం చెబుతోంది.

ఇందిరా గాంధీ ప్యారీ బెహ్నా సమ్మన్ నిధి యోజన..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు మీదుగా ఇందిరా గాంధీ ప్యారీ బెహనా సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందజేస్తారు. మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే వారి జీవన పరిస్థితులు మెరుగు పడతాయని, వారికి కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. నిబంధనల మేరకు అర్హులైన మహిళలందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి. మహిళలకు ఆర్థిక భరోసా, సామాజిక గౌరవం, ప్రోత్సాహం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 10 గ్యారంటీల్లో భాగంగా దీనిని కూడా ప్రకటించింది.

నిబంధనలు తెలుసుకుందాం..

ఇందిరా గాంధీ ప్యారీ బెహనా సమ్మాన్ నిధి యోజన పథకానికి ఎవరు అర్హులు. నిబంధనలు ఏమిటి తదితర వివరాలను చూస్తే… ఈ పథకం వివరాలను ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళలందరికీ ఈ పథకం వర్తించదు. కొన్ని నిబంధనలను విధించింది. అలాగే దీనికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. సమీపంలోని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. అక్కడ దరఖాస్తు తీసుకుని, అవసరమైన ప్రతాలన్నీ జత చేసి అధికారులకు ఇస్తే పని పూర్తయినట్టే. మీరు అన్ని విధాలా అర్హులైన సంబంధిత అధికారులు వెంటనే ఆమోదిస్తారు.

వీరికి వర్తించదు..

  • హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ కింద తెలిపిన వారికి ఇందిరా గాంధీ ప్యారీ బెహనా సమ్మాన్ నిధి యోజన పథకం వర్తించదు.
  • ఆదాయపు పన్ను చెల్లింపుదారులు
  • మఠాలలో శాశ్వతంగా నివసిస్తున్న మహిళా సన్యాసులు
  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు
  • పంచాయతీ రాజ్, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు
  • పెన్షన్ పరిధి నుంచి మినహాయించిన ఇతర వర్గాలలో కాంట్రాక్టు ఉద్యోగులు, రోజువారీ వేతన జీవులు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, మాజీ సైనికులు, వారి భార్యలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు

దరఖాస్తు చేసుకునే విధానం..

  • సమీపంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, ఈ పథకం గురించి వివరాలు తెలుసుకోవాలి.
  • దరఖాస్తు ఫారం తీసుకుని, దానిలో అడిగిన వివరాలన్నీ సక్రమంగా పూర్తి చేయాలి.
  • ఆ ఫారానికి అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలి.
  • వాటిని అధికారులు పరిశీలించి, అన్ని సక్రమంగా ఉంటే వెంటనే ఆమోదిస్తారు.
  • తదుపరి నుంచి మీ బ్యాంకు ఖాతాలో పథకం ఆర్థిక సాయం జమ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..