AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఉచితంగా లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది. కానీ త్వరలో మర్చంట్ ఫీజును వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..
Upi
Venkatrao Lella
|

Updated on: Jul 17, 2026 | 9:54 AM

Share

యూపీఐ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వనుంది. యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు వసూలు చేసేందుకు మోదీ సర్కార్ సిద్దమవుతోంది. ప్రస్తుతం కొన్ని రకాల లావాదేవీలకు బ్యాంకులు రుసుంలు వసూలు చేస్తోన్నాయి. అదే తరహాలోనే యూపీఐ పేమెంట్స్‌కు కూడా ఛార్జీలు చేయనున్నారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు ఉచితంగా చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఎంత పెద్ద లావాదేవీ జరిపినా ఛార్జీలు విధించడం లేదు. యూపీఐ ట్రాన్సాక్షన్లకు మర్చంట్ డిస్కౌంట్ రేటు గత ఐదేళ్లుగా జీరోగా ఉంది. అయితే పెద్ద వ్యాపార సంస్థల ట్రాన్సాక్షన్లకు మర్చంట్ ఫీజును విధించేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయి.

కేంద్రం నుంచి త్వరలో ఆమోదం

ప్రస్తుతం కేంద్రం వద్ద దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీనిపై కేంద్రం చర్చలు జరుపుతుండగా.. త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే పెద్ద వ్యాపారులు, ఈకామర్స్ దిగ్గజాలు మాత్రమే ఈ ఛార్జీల పరిధిలోకి రానున్నాయి. ఈ రుసుంల వల్ల యూపీఐ పేమెంట్ యాప్స్, బ్యాంకులకు అదనపు ఆదాయం దక్కనుంది. జనవరి 2020 నుంచి ఉచితంగా సేవలు అందిస్తుండగా.. ఇప్పుడు ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఎండీఆర్ ఛార్జీల విషయానికొస్తే.. రూ.40 లక్షలపైన వార్షిక టర్నోవల్ ఉన్న మర్చంట్లపై 5 నుంచి 7 బేసిస్ పాయింట్ల వరకు ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నారు. రూ.10 వేలపైన ట్రాన్సాక్షన్ చేస్తే రూ.5 నుంచి రూ.7 వరకు మర్చంట్ ఫీజు ఉంటుంది.

వారి నుంచి మాత్రమే వసూలు

అయితే వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల కంటే తక్కువ ఉన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇక సాధారణ వినియోగదారులకు కూడా ఉచితంగా లావాదేవీలు చేయవచ్చు. కేవలం పెద్ద వ్యాపారుల నుంచే మాత్రమే వసూలు చేస్తారు. యూపీఐ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ నిధులు యాప్స్ నిర్వాహకులకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. జీరో ఎండీఆర్ ఛార్జీల వల్ల పేటీఎం, ఫోన్ ఫే, గూగుల్ పే లాంటి యాప్స్‌కు ఎలాంటి అదనపు ఆదాయం లభించడం లేదు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ సొమ్ము కూడా యూపీఐ నిర్వహణకు సరిపోవడం లేదు. దీంతో యూపీఐ యాప్స్ స్థిర ఆదాయం కోసం ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం పెద్ద వ్యాపారుల నుంచి మర్చంట్ ఛార్జీలు వసూలు చేసేందుకు ముందడుగు వేసింది.

Follow Us
యూపీఐ లావాదేవీలు చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం షాకింగ్
యూపీఐ లావాదేవీలు చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం షాకింగ్
కరోనా చికత్సకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
కరోనా చికత్సకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ