AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. భారీగా ర్యాంకులు కొల్లగొట్టిన తెలుగోళ్లు!

నీట్ యూజీ 2026 రీటెస్ట్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. తెలంగాణకు చెందిన హనుమకొండ విద్యార్థి వీరయ్యగారి సహ్యు 705 మార్కులతో ఆలిండియా 13వ ర్యాంకు సాధించగా, బూర సాయిచరణ్, కందగట్ల అనిష్, అందెం సాయిచరణ్‌రెడ్డి తదితరులు టాప్-100లో చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నామాల ప్రేరణ, గ్రంధి హనీష్, రేలంగి జయషణ్ముఖి సహా పలువురు జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించి రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు..

NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. భారీగా ర్యాంకులు కొల్లగొట్టిన తెలుగోళ్లు!
NEET Ranker Veerayyagari Sahyu
Srilakshmi C
|

Updated on: Jul 17, 2026 | 9:21 AM

Share

హైదరాబాద్‌, జులై 17: నీట్‌ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ గురువారం రాత్రి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లో 14 నగరాల్లో కలిపి మొత్తం 5,440 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 11.21 లక్షల మంది అర్హత పొందినట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఫైనల్‌ ఆన్సర్‌ కీ విడుదల చేసిన గంటల వ్యవధిలో ఎన్టీయే తుది ఫలితాలు ప్రకటించింది. నీట్‌ పేపర్‌ లీక్‌తో మే 3న నిర్వహించిన పరీక్ష రద్దుకాగా.. జూన్‌ 21న మళ్లీ దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించారు.

నీట్‌ యూజీ 2026 రీటెస్ట్‌ ఫలితాలు, స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నీట్ పరీక్షలో దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు టాప్‌ 100 ర్యాంకర్లలో చోటు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు 705 మార్కులతో ఆలిండియాలో 13వ ర్యాంకు సాధించాడు. బూర సాయిచరణ్‌ 19వ ర్యాంకు, కందగట్ల అనిష్‌ 21వ ర్యాంకు, అందెం సాయిచరణ్‌రెడ్డి 38వ ర్యాంకు, మయూక్‌ జయసింహ 42వ ర్యాంకు, కొంపెల్ల సాయిగాయత్రి 83వ ర్యాంకు, రుతుంబిక మొహంతి 91వ ర్యాంకు సాధించారు. దేవిష్‌ శ్రీగోపాల్‌ అగర్వాల్‌ 123వ ర్యాంకు పొందారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలువురు నీట్‌లో సత్తా చాటారు. నామాల ప్రేరణ 36వ ర్యాంకు, గ్రంధి హనీష్‌ 74వ ర్యాంకు, రేలంగి జయషణ్ముఖి 86వ ర్యాంకు, కొండ్రెడ్డి హారిక దేవిశ్రీ అనూహ్య 103వ ర్యాంకు, వంగా శ్రీనివాసరెడ్డి 125వ ర్యాంకు, వడ్డేపల్లి దుష్యంత్‌ 126వ ర్యాంకులతో ఆల్‌ ఇండియా స్థాయిలో మెరిశారు. ఆలిండియా కోటా సీట్లను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ), రాష్ట్రస్థాయి కోటా సీట్లను సంబంధిత రాష్ట్రాల మెడికల్‌ యూనివర్సిటీలు నిర్వహిస్తాయి. స్టేట్‌ వైజ్‌ అభ్యర్థుల స్కోర్‌ కార్డులు, టాపర్ల వివరాలు, కటాఫ్‌ మార్కులను కూడా ఎన్టీయే విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 36 ప్రభుత్వ, 30 ప్రైవేటు, 3 డీమ్డ్‌ యూనివర్సిటీలు, 4 మైనార్టీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 9,650 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా కౌన్సెలింగ్‌ తరువాత రాష్ట్రస్థాయిలో ఆగస్టు నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్ఉనట్లు అని కాళోజీ వర్సిటీ వీసీ రమేశ్‌రెడ్డి తెలిపారు.

నీట్‌ యూజీ 2026 రీటెస్ట్‌ ఫలితాలు, స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలేనా? ఈ చిన్న పరిహారాలు పాటించండి!
మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలేనా? ఈ చిన్న పరిహారాలు పాటించండి!